పుట:Nutna Nibandana kathalu.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నిండేటంతగా చేపలు దొరికాయి. పగలు అన్ని చేపలు చిక్కడం చూచి పేతురు ఆశ్చర్యపోయి ప్రభూ! నేను పాపాత్ముణ్ణి. నీవు నన్ను విడచి వెళ్లిపో అని అరచాడు. యేసు అతనితో ఇకమీదట నీవు చేపలను గాక మనుష్యులను పడతావు అని చెప్పాడు. ఆ పిమ్మట ఆ బెస్తలు అన్నీ వదిలివేసి క్రీస్తుకి శిష్యులయ్యారు.


23. పక్షవాతరోగికి ఆరోగ్యం -లూకా 5,17-26


యేసు ఒక యింటిలో బోధ చేస్తుండగా జనం క్రిక్కిరిసివున్నారు. కొందరు ఓ పక్షవాత రోగిని అతని చెంతకు మోసికొని వచ్చారు. కాని జనం ఇంటినిండ క్రిక్కిరిసి వున్నందున అతని చెంతకు వెళ్లలేక పోయారు. కనుక ఇంటిమీది కప్ప ఊడదీసి మంచంతో పాటు రోగిని క్రీస్తు ముందటికి జారవిడిచారు. యేసు వారి విశ్వాసాన్ని మెచ్చుకొని రోగితో బాబూ! నీ పాపాలు క్షమింపబడ్డాయి అని చెప్పాడు. అక్కడ ప్రోగైవున్న ధర్మశాస్త్ర బోధకులు పాపాలు క్షమించడానికి ఇతడెవరు? ఆ పని చేసేది దేవుడొక్కడే కదా అని తమలో తాము తర్కించుకొన్నారు. క్రీస్తు వారితో ఏది సులభం? పాపాలు క్షమించడమా లేక రోగిని నడిపించడమా? నాకు పాపాలు క్షమించే అధికారం గూడ వుందని నిరూపిస్తాను అని చెప్పి రోగిని నీవు లేచి యింటికి వెళ్లిపో అని ఆదేశించాడు. రోగి వెంటనే లేచి యింటికి వెళ్లిపోయాడు. యూదుల భావాల ప్రకారం పాపాలు వ్యాధిని తెచ్చిపెడతాయి. ఇక్కడ రోగి లేచినడచాడు అనగా అతని పాపాలు తొలగిపోయినట్లే కదా! ఈలా క్రీస్తుకి పాపాలు పరిహరించే శక్తి కూడ వుందని రుజువైంది.


24. శతాధిపతి సేవకునికి ఆరోగ్యం - లూకా 7.1-10


కఫర్నాములో ఓ రోమను శతాధిపతి వున్నాడు. అతని సేవకుడు ಜಬ) పడ్డాడు. వుద్యోగి యూదులను అభిమానంతో చూచి వారికి ప్రార్థనా మందిరాన్ని కట్టిపెట్టాడు. కనుక పెద్దలు ఆ సేవకుని వ్యాధి నయంజేయమని యేసుకి శిపార్సు చేశారు. అతడు శతాధిపతి యింటికి