పుట:Nutna Nibandana kathalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడి నుండి క్రిందికి త్రోయబోయారు. కాని యేసు వారి మధ్యనుండి తప్పించుకొని వెళ్లిపోయాడు.


21. రోగులకు స్వస్థత -లూకా 4,31–42


యేసు నజరేతునుండి కఫర్నాముకి వచ్చాడు. అచట ప్రార్థనా మందిరంలో దయ్యం పట్టినవాడు కన్పించాడు. ఆ దయ్యం నీవు దేవుని పవిత్ర మూర్తివి. నీవు మమ్మనాశం చేయడానికి వచ్చావు అని అరచింది. ప్రభువు నీవు ఇతన్ని విడచి వెళ్లిపో అని ఆజ్ఞాపించగానే అది వెళ్లిపోయింది. దయ్యాలు కూడ ఇతనికి లొంగుతున్నాయి కదా అని ప్రజలు ఆశ్చర్య పోయారు.

పిమ్మట ప్రభువు సీమోను ఇంటికి పోయాడు. అక్కడ సీమోను అత్త జ్వరంతో మంచంపట్టివుంది. జనం ఆమె సంగతి క్రీస్తుకి తెలియజేశారు. అతడు ఆమె దగ్గరికి పోయి జ్వరాన్ని విడచిపొమ్మని ఆజ్ఞాపింపగా అది వదలిపోయింది. ఆమె లేచి క్రీస్తుకి భోజనం సిద్ధం చేసింది. ఆ సాయంకాలం చాలమంది రోగులు రాగా యేసు వారి వ్యాధులు నయం చేశాడు. నీవు దేవుని కుమారుడివి అని అరుస్తూ అనేకుల నుండి దయ్యాలు వెళ్లిపోయాయి.

22. శిష్యులకు పిలుపు - లూకా 5,1-11


యేసు గెన్నెసరీతు సరస్సు తీరాన వున్నాడు. జనం అతని బోధ వినడానికి వచ్చారు. ప్రభువు పేతురుచే పడవను నీటిలోనికి త్రోయించి దానితో కూర్చుండి బోధ చేయగా ప్రజలు విన్నారు. అటుపిమ్మట యేసు పడవను సరస్సులోనికి కొనిపోయి చేపలను పట్టండని చెప్పాడు. పేతురు, మేము రాత్రంతా తిప్పలు పడ్డాం. చేపలు ఏ మాత్రం దొరకలేదు. ఐనా నీ మాట ప్రకారం ఇప్పడు మళ్లా ప్రయత్నం చేస్తాం అన్నాడు. బెస్తలు వలవేయగానే అది పిగిలి పోయేలా చేపలుపడ్డాయి. పేతురు ఇంకో పడవ వారిని గూడ వచ్చి సహాయం చేయమని పిల్చాడు. రెండు పడవలు