పుట:Nutna Nibandana kathalu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విన్నారు. వారి కోరికపై అతడు ఆ వూరిలో రెండు రోజులు మాకాము చేశాడు. ఆ జనం మేము స్వయంగా ఇతని బోధలు విన్నాం. ఇతడు నిజంగానే లోకరక్షకుడు అని పల్మారు.


19. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ - యోహా 8,1-11

ఒకసారి ప్రభువు దేవళంలో బోధిస్తుండగా ధర్మశాస్త్ర బోధకులు వ్యభిచారంలో చిక్కిన స్త్రీని అతని దగ్గరికి కొనివచ్చి ధర్మశాస్త్రం ఆదేశించి నట్లుగా ఈమెను రాళ్లతో కొట్టమంటావా వద్దా అని అడిగారు. క్రీస్తు ఏ విధంగా జవాబు చెప్పినా చిక్కుల్లో పడతాడని వారి ఉద్దేశం. ప్రభువు వారితో మీలో పాపం చేయనివాడు మొదట ఆమె మీద రాయి విసరవచ్చు అన్నాడు. ఆ జవాబు విని ప్రజలు సిగ్గుపడి ఒకరివెంట వొకరు జారుకొన్నారు. ప్రభువు ఆ స్త్రీని చూచి వీళ్లు నిన్ను శిక్షించలేదు. నేను కూడ నిన్ను శిక్షించను. ఇక వెళ్లు. మళ్లా తప్పు చేయుకు అని హెచ్చరించాడు. 20. నజరేతులో క్రీస్తు బోధ - లూకా 4,16-30 సుఖారు నుండి క్రీస్తు సొంత నగరమైన నజరేతుకి వచ్చాడు. శనివారం ప్రార్థనా మందిరానికి వెళ్లి ప్రజలకు యెషయా ప్రవచనం చదివి విన్పించాడు. ఆ ప్రవక్త మెస్సీయా వచ్చినపుడు పేదలను ఆదుకొంటాడు అని వ్రాశాడు. క్రీస్తు ఆ యెషయా ప్రవచనం తనకే వర్తిస్తుందనీ తాను పేదలకోపు తీసికొనేవాణ్ణనీ నుడివాడు. ప్రజలు అతని బోధ విని యోసేపు కుమారునికి ఇంత జ్ఞానం ఏలా అలవడిందా అని విస్తుపోయారు.

అటుపిమ్మట యేసు పూర్వం యేలీయా ప్రవక్త సారెఫతు గ్రామానికి చెందిన అన్యజాతి విధవకూ, యెలీషా ప్రవక్త అన్యజాతి వాడైన నామానుకూ సహాయం చేశారని నుడివాడు. యూదులకు అన్యజాతి వాళ్లు గిట్టరు. కనుక వారి ప్రస్తావనం తెచ్చిన క్రీస్తుమీద మండిపడ్డారు. వారి నగరం కొండమీద వుంది. క్తత్రన్ని ఆ కొండమీదికి తీసికొనిపోయి