పుట:Nutna Nibandana kathalu.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది18. సమరయ స్త్రీ - యోహా 4

యేసు సమరయ రాష్టం గుండ ప్రయాణం చేస్తూ సుఖారు నగరంలోని యాకోబు బావి దగ్గర ఆగాడు. శిష్యులు ఆహార పదార్థాలు కొనడానికి నగరంలోకి వెళ్లారు. ఒక సమరయ ప్రీ నీటిని తోడుకొని పోవడానికి అక్కడికి వచ్చింది. యేసు అమ్మా! త్రాగడానికి కొంచెం నీళ్లు ఇవ్వమని అడిగాడు. ఆమె యూదుడవైన నీవు మా నీళ్లు ఎలా త్రాగుతావు అంది. అతడు అమ్మా నేనెవరినో నీవు గుర్తించినట్లయితే నీవే నన్ను నీళ్లీయమని అడిగేదానివి. నేను నీకు జీవజలం ఇచ్చివుండేవాడిని అని చెప్పాడు. ఆమె అయ్యా! నీ దగ్గర బొక్కెనలేదు. నాకు జీవజల మెలాగిస్తావు? నీవు ఈ బావి త్రవ్వించిన యాకోబుకంటె గొప్పవాడివా యేమి అని అడిగింది. యేసు ఈ నీళ్లు త్రాగితే మళ్లా దప్పిక వేస్తుంది. కాని నేనిచ్చే నీళ్లు త్రాగితే ఇక దప్పిక వేయదు అన్నాడు. ఆమె, ఐతే నాకు ఆ నీళ్లు ఇవ్వు అని అడిగింది.

యేసు నీవు వెళ్లి నీ భర్తను తీసుకొనిరా అని చెప్పాడు. ఆమె నాకు పెనిమిటి లేడు అని జవాబు చెప్పింది. యేసు అమ్మా! నీవు ఐదుగురితో కాపురం చేశావు. ఇప్పడున్నవాడు కూడ నీ పెనిమిటి కాడు అని చెప్పాడు. ఆలా అతడు తన సొంత విషయాలు చెప్పడం చూచి ఆమె విస్తుపోయి అయ్యా! నీవు ప్రవక్తలా గున్నావు. మా ప్రజలు గెరిజం కొండమీద దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మీవాళ్లు యెరూషలేములో దేవుణ్ణి పూజిస్తున్నారు అని పల్కింది. యేసు ఇకమీదట అందరూ ఆత్మద్వారా తండ్రిని ఆరాధిస్తారు అని చెప్పాడు. ఆమె, మెస్సీయా వచ్చినప్పడు మాకు అన్ని విషయాలు తెలియజేస్తాడు అని చెప్పింది. యేసు నేనే ఆ మెస్సీయాను సుమా అని పల్కాడు.

ఆమె త్వరగా నగరంలోనికి వెళ్లి జనంతో ఒక మనిషి నేను చేసిన పనులన్నీ తెలియజెప్పాడు. ఒకవేళ అతడే మెస్సియా యేమో అని చెప్పింది. ఆ నగర వాసులు యేసుని చూడ్డానికి వచ్చి అతని బోధలు