పుట:Nutna Nibandana kathalu.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కూడదు. మన కంటిలో దూలం వుండగా ప్రక్కవాడి కంటిలోని నలుసుని చూడకూడదు. దేవుణ్ణి నమ్మకంతో అడుగుకోవాలి. బిడ్డడు ఆకలిగొని అన్నం పెట్టమంటే తల్లిదండ్రులు పెట్టరా?

పండునుబట్టి చెట్టు ఏలాంటిదో తెలుస్తుంది. నరుని క్రియలను బట్టి అతడెలాంటివాడో తెలిసి పోతుంది. మంచివాళ్లాగా నటిస్తేనే చాలదు.

ఇతరులు మనకు ఏమి చేయాలని కోరుకొంటామో అదే మనం ఇతరులకు చేయాలి.

పర్వత ప్రసంగాన్ని ఆనాటి ప్రజలు మెచ్చుకొన్నారు. అది యిప్పడు మనకు కూడ ప్రేరణం పుట్టిస్తుంది.


15. నీటిని ద్రాక్షరసంగా మార్చడం -యోహా 2,1-11

యేసు, శిష్యులు, తల్లి మరియ కానావూరి వివాహానికి వెళ్లారు. ఆ పెండ్లిలో ద్రాక్షరసం కొరతపడింది. తల్లి మరియు వారికి రసం ఐపోయింది అని కుమారునితో చెప్పింది. క్రీస్తు నేను అద్భుతాలు చేసే సమయం ఇంకా రాలేదు గదా అన్నాడు. మరియు సేవకులతో మీరు ఆయన చెప్పినట్లు చేయండి అని నుడివింది. జనం కడుగుకొని శుద్ధి చేసికోవడానికి అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. యేసు ఆజ్ఞపై వాటిని నీటితో నింపగా అతడు ఆ నీటిని రసంగా మార్చాడు. విందు నడిపే పెద్ద ఆ రసాన్ని రుచి చూచి ఆశ్చర్యపోయాడు. పెండ్లి కుమారునితో విందుల్లో మామూలుగా మొదట మంచి రసాన్ని పోస్తారు. కడన నాసిరకం రసాన్ని పోస్తారు. కాని నీవు మెరుగైన రసాన్ని కడపటిదాక అట్టిపెట్టావు అన్నాడు. ఇది యేసు చేసిన మొదటి అద్భుతం. శిష్యులు అతని శక్తిని గుర్తించారు.

16. దేవాలయాన్ని శుద్ధిచేయడం - యోహా 2,13-22

16. దేవాలయాన్ని శుద్ధిచేయడం - యోహా 2,13-22

యేసు పాస్కపండుగకు యెరూషలేము వెళ్లాడు. అక్కడ దేవాలయం బేరగాళ్లతో నిండిపోయింది. ఎడ్లను, గొర్రెలను, పావురాళ్లను అమ్మ