పుట:Nutna Nibandana kathalu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తున్నారు. డబ్బులు మారుస్తున్నారు. క్రీస్తు కోపంతో కొరడా పేని వారి పశువులను బయటికి తోలాడు. డబ్బులు మార్చేవారి బల్లులు కూలద్రోశాడు. వీటినన్నిటినీ ఇక్కడి నుండి తీసికొని పోండి. నా తండ్రి ఆలయం సంతపట్టుకాదు అని అరచాడు. యూదనాయకులు నీవు ఏ యధికారంతో వీళ్లను వెళ్లగొడుతున్నావు? మాకు ఏమి గురుతు చూపిస్తావు అని అడిగారు. అతడు మీరు ఈ దేవళాన్ని పడగొట్టండి. నేను మళ్లా మూడురోజుల్లో దీన్ని నిర్మిస్తాను అని జవాబు చెప్పాడు. నాయకులు దీన్ని కట్టడానికి 46 ఏండ్లు పట్టింది. నీవు మూడు నాళ్లలోనే దీన్ని మళ్లా కడతావా అని అడిగారు. ఐతే క్రీస్తు కడతానని చెప్పింది రాతిగుడికాదు. సొంత శరీరమనే ఆలయాన్నే అతని పునరుత్థానం తర్వాత శిష్యులు ఈ మాటల భావాన్ని గ్రహించారు. ఇక్కడ దేవాలయం క్రీస్తు పునరుత్థాన శరీరమే.


17. నికొదేము - యోహా 3,1-17


నికొదేము యూదుల మహాసభ సభ్యుడు. ధర్మశాస్త్ర బోధకుడు. అతడు యూదులకు భయపడి రాత్రివేళ యేసుదగ్గరికి వచ్చాడు. నీవు దేవుని నుండి వచ్చావు. దేవుని సహాయం లేందే నీవు ఈ యద్భుతాలు చేసి వుండేవి కాదు అన్నాడు. యేసు నరుడు మరల జన్మిస్తేనే గాని దైవ రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పాడు. ఆ మాటలు నికొదేముకి అర్థం కాలేదు. అతడు జనుడు తల్లి గర్భంలోకి ప్రవేశించి మరల పుడతాడా అని అడిగాడు. యేసు జ్ఞానస్నానం వలన నరునికి నూత్నజన్మ సిద్ధిస్తుంది. మనుష్య కుమారుడు సిలువమీద చనిపోయి నరులకు రక్షణాన్ని ప్రసాదిస్తాడు. తండ్రి లోకంలోని నరులను ప్రేమించి తన ఏకైక కుమారుని పంపాడు. ఆ కుమారుని విశ్వసించే ప్రతివాడు రక్షణం పొందుతాడు అని చెప్పాడు. నికొదేముకి క్రీస్తు పట్ల విశ్వాసం పుట్టింది. తర్వాత అతడు క్రీస్తు శరీరాన్ని భూస్థాపనం చేయడంలో సాయపడ్డాడు. ఈ భక్తునిలాగే మనం కూడ ప్రభువుని నమ్మాలి.