పుట:Nutna Nibandana kathalu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిష్యులు భోజనంలో వుప్పలా వుండాలి. చీకటిలో దీపంలా వుండాలి. వారి పనులు యోగ్యంగా వుండాలి.

క్రీస్తు ధర్మశాస్రాన్ని రద్దు చేయడానికి గాక పరిపూర్ణం చేయడానికి వచ్చాడు. క్రీస్తు శిష్యులు యూదులకంటె అధికంగా పవిత్ర జీవితం గడపాలి.

తోడివారితో ఒద్దికగా జీవించాలి. దేవుణ్ణి పూజిస్తేనే చాలదు. ఇరుగు పొరుగు వారితో ప్రేమగా మెలగాలి. శత్రువులను ప్రేమించాలి. పగ తీర్చుకో గూడదు. మంచివారినీ చెడ్డవారినీ కూడ అంగీకరించాలి. దేవుడు సజ్జనులకూ, దుర్జనులకూ గూడ సమానంగా వాన కురిపిస్తాడు. అందరికీ సూర్యుని వెలుగునీ, వేడిమినీ ప్రసాదిస్తాడు. మిత్రులను మాత్రమే ఆదరిస్తే మన గొప్ప యేమిటి?

మన దానధర్మాలను పదిమందికి ప్రకటించనక్కరలేదు. కుడిచేయి చేసే దానాన్ని ఎడమచేతికి తెలియకుండేలా చేయాలి. దేవుడు మన సత్కార్యాలను చూచి మెచ్చుకోవాలి గాని నరులు మెచ్చుకుంటే యేమి ప్రయోజనం? మన ప్రార్థన ఉపవాసాలు మొదలైన పుణ్యక్రియలు కూడ నరులు చూచి మెచ్చుకొనేలా వుండకూడదు. దేవుడు వాటిని గుర్తిస్తే చాలు.

ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకొంటే చాలదు. అవి కొద్దికాలం లోనె నాశమైపోతాయి. మన సంపదలు పరలోకంలో దేవుని సన్నిధిలో వుండాలి. నరులు దేవుణ్ణి ధనాన్నీ ఒకేసారి సేవించలేరు.

ప్రజలు దేవుణ్ణి నమ్మి అతనిమీద ఆధారపడి జీవించాలి. కూడు గుడ్డా కొరకు వెంపర్లాడకూడదు. పరలోకంలోని తండ్రి ఆకాశ పక్షులకు తిండి పెడతాడు. గడ్డిమొక్కలను పూల బట్టలతో అలంకరిస్తాడు. తన బిడ్డలమైన మనకు అవసరమైనవి తప్పకుండా దయచేస్తాడు. కనుక రేపటిని గూర్చి చింతలు వంతలు అవసరం లేదు.

పరులకు తీర్పు తీరమాస్త్రృతరులను సులువుగా విమర్శించ