పుట:Nutna Nibandana kathalu.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దిగివచ్చి నిన్ను కాపాడతారులే అంది. క్రీస్తు నీవు దేవుణ్ణి శోధించకూడదు అని జవాబు చెప్పాడు. ఇది రెండవ శోధనం. మూడవసారి పిశాచం క్రీస్తుకి భూలోక రాజ్యాలన్నీ చూపించింది. నీవు నన్ను ఆరాధించావంటే నేను ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చి వేస్తాను అని చెప్పింది. క్రీస్తు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అని చెప్పాడు. పిశాచం ఓడిపోయి వెళ్లిపోగా దేవదూతలు వచ్చి క్రీస్తుకి సేవలు చేశారు.

13. మొదటి ఐదుగురు శిష్యులు -యోహా 1,35-51

స్నాపక యోహాను తన శిష్యులైన అందైయ యోహానులకు క్రీస్తుని చూపించి ఇదిగో! దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. వాళ్లు యోహానుని విడిచిపెట్టి క్రీస్తుకి శిష్యులయ్యారు. ఆంద్రేయ తన అన్నపేతురుని క్రీస్తు దగ్గరికి తీసికొని వచ్చాడు. క్రీస్తు అతన్ని చూచి ఇక మీదట నిన్ను కేఫా లేక రాయి అని పిలుస్తారు అని చెప్పాడు. కనుక అతని పేరు పేతురు లేక రాయప్ప ఐంది. ఫిలిప్ప కూడ పేతురులాగే బెత్సయిదా నగర వాసి. క్రీస్తు పిలువగా అతడు కూడా ప్రభువుకి శిష్యుడయ్యాడు. ఈ ఫిలిప్ప నతనియేలుని క్రీస్తు దగ్గరికి తీసికొని వచ్చాడు. క్రీస్తు నేను నిన్నుపూర్వమే అంజూరపు చెట్టు క్రింద చూచాను అన్నాడు. అతడు కూడ ప్రభువుకి శిష్యుడు అయ్యాడు. ఈ రీతిగా తొలి ఐదుగురు శిష్యులు ప్రోగయ్యారు.

14. పర్వత ప్రసంగం - మత్త 5-7

ప్రభువు పర్వతమెక్కి శిష్యులకు ప్రజలకూ బోధ చేశాడు. ఈ ప్రసంగం శతాబ్దాల పొడుగున చాలమందికి ప్రేరణం పుట్టించింది. క్రీస్తు బోధల సారాంశమంతా దీనిలో యిమిడి వుంది. పసిబిడ్డడు పెద్దవారిమీద లాగే నరుడు దేవునిమీద ఆధారపడి జీవించాలి. అతడు వినయంగాను, దయామయుడుగాను వుండాలి. హృదయం నిర్మలంగా వుండాలి.