పుట:Neti-Kalapu-Kavitvam.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

వాఙ్మయ పరిశిష్టభాష్యం --- నేటికాలపుకవిత్వం


అంతకు పూర్వం వికసితమైన జిజ్ఞాసల నన్నిటిని ప్రసిద్దభారతీయ విద్వద్గోష్ఠుల్లో మననంచేసి ఆపైన వారి అనుభవాన్ని సందర్భంవచ్చినచోట కావ్యమర్యాదతో వినిపిస్తూ వచ్చారు. ఔపనిషదం జైమినీయం పౌరాణికం, కాపిలం కాణాదం నైయాయికం పాతంజలం మొదలైనమార్గాల తత్వ సిద్ధాంతాలను స్వానుభవాలను అనుసరించి మేళగించి కావ్యనయాన కాళిదాసు రఘువంశదశమాశ్వాసంలో దేవతలు రావణ వధార్థం విష్ణువును ప్రార్ధించిన సందర్భాన.

1. "నమో విశ్వసృజే పూర్వం విశ్వం తదనుబిభ్రతే,
   అథ విశ్వస్య సంహర్త్రే తుభ్యం త్రేధా స్థితాత్మనే.

2. రసాంతరాణ్యేకరసం యధా దివ్యం పయోశ్నుతే,
   దేశే దేశే గుణేష్వేవ మనస్థా స్త్వమవిక్రియః.

3. ఏకః కారణతస్తాం తాల అవస్థాం ప్రతిపద్యసే,
   నానాత్వం రాగసంయోగాత్ స్ఫాటికస్యేవ దృశ్యతే.

4. అమేయో మితలోకస్త్వమనర్థీ ప్రార్థనావహః,
   అజితో జిష్ణురత్యంత మవ్యక్తో వ్యక్తకారణం.

5. హృదయస్థ మనాసన్నమకామం త్వాం తపస్వినం.
   దయాళుమనఘస్పృష్టం పురాణమజరం విదుః.

6. సర్వజ్ఞస్త్వమవిజ్ఞాతః సర్వయోనిస్త్వమాత్మభూః,
   సర్వప్రభురనీశ స్త్వమేకస్త్వం సర్వరూపభాక్.

7. సప్తసామోపగీతం త్వాం సప్తార్ణవజలేశయం,
   సప్తార్చిర్ముఖమాచఖ్యుః సప్తలోకైకసంశ్రయమ్.