పుట:Neti-Kalapu-Kavitvam.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


56

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

రాత్రీక్ంతలములలో
శశిరమ్ములో

అని యిట్లా ఉదాహరణాలు గుప్పించి, అది కావ్యమవుతుందని మురియడం అనుచితమైనది.

ఆక్షేపం

   అవునయ్యా "వాక్యం రసాత్మకంకావ్యం" అని విశ్వనాధు డన్నాడు. ఒక వాక్యమైనాచాలు రసవంతమైనది అదేకావ్యం అనేక వాక్యాలు వుండవలసిన పనిలేదు అని అంటారా?

సమాధానం

    చెప్పుతున్నాను. వాక్యం రసాత్మకంకావ్యంఅంటే మహావాక్యం అని అభిప్రాయం లేదా రసాత్మక వాక్యం కావ్యాంశం అని అయినా అభిప్రాయం మీరుచెప్పించే ఆవాక్యానికి అర్ధమైతే ఒకవాక్యం వ్రాసి కవిగావచ్చును.
  వాక్యంతో పనిలేదు.
   "తదదోషౌ శబ్దార్దొ సగుణావనలంకృతీపుర: క్వాపి" (కావ్య)

అని సాహితీవేత్తలంటారు.

శబ్దార్దో అంటే శబ్దం అర్ధం రెండు అని అభిప్రాయం శబ్దానికి అర్ధం యెట్లానైనా వుంటుంది గనుక ఒక మంచిశబ్దం రచిస్తే చాలు కావ్య మౌతుంది రచయిత కవి అవుతాడు.

"మందు। కవి యశ। ప్రార్ధీ"

అని కాళిదాసువంటివాడు చెప్పడం అనవసరం ఇంతమంది ఇంత తేలికగా కవులవుతుంటే అతనికి జంకెందుకు? ఇందు వదన ఇది ఒకకావ్యం సుందరాంగి ఓకావ్యం, ఇందువదనకౌగిలియ్యవే సుందరాంగి ముద్దుపెట్టవే, ఇవి రెండు మహాకావ్యాలు అని నిర్ణయించవచ్చును. కాని యివన్నీ తెలివితక్కువ మాటలు ఒక భావంగాని రసంగాని పరిపొషం చెందినప్పుడే కావ్యత్వ సిద్దికలుగుతున్నది. కాదా అని కొన్నిమాటలే