పుట:Neti-Kalapu-Kavitvam.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిదర్శనాధికరణం

55


ప్రసాదించే పరమార్థానికి ఉన్ముఖమై వుండవలిసిన కావ్యం జాబితాలను, తయారుచేస్తున్నప్పటి పతితదశ వాస్తవంగా సంతాపకరమైనది.

ఆక్షేపం.

అవునయ్యా. ఇప్పటిది భావకవిత్వమని అది కొత్తదని మేమన్నాము. దాన్ని మీరు కాదనలేదు. భావకావ్యమంటనే యేకభావాన్ని ప్రతిపాదించేది. ఒకటేభావాన్ని అనేకభంగుల ప్రతిపాదించారు. దీంట్లో దోషమేమిటి? అని అంటారా.

సమాధానం.

చెప్పుతున్నా ను, భావకావ్యాన్ని ముందు విచారిస్తాను. ప్రేమ, భక్తి, వంటి చిరావస్థానంగల మనోవృత్తి భావం. ఇదే కావ్యానికి విషయం. నిద్రపోతున్నాను: అన్నందిన్నాను; అనే ఒక వాక్యార్థంకాదు భావం. అదేభావమని వొప్పుకున్నా ఆభావంవల్ల కలిగేచేష్టలు వివిధసందర్భాల్లో వేడలేసంభాషణలు, తత్సంబంధి మనో వ్యాపారాలు, ఇవన్నీ ప్రతిపాదించడం భావ ప్రతిపాదనంగాని ఒకటే అభిప్రాయానికి తిప్పితిప్పి పది పన్నెండు ఉదాహరణా లియ్యడం గాదు. ఇట్లా ఉదాహరణాలు అయిదారో పది పన్నెండో కలిస్తే ఆది వోక కావ్యమనే అభిప్రాయం గూడా ఈరోజుల్లో వ్యాపించింది.

చాటుపద్యాలు.

వ్యాకరణం మొదలైన శాస్త్రాల్లోవలె ఉదాహరణలు గుప్పడం కవిత్వంగా దని నిరూపించాను. అయినా ఒకభావాన్ని పరిపోషం చేసేటప్పుడు అంగంగా అవసరమైనంతమట్టుకు యివి చెప్పితే ఒకప్పుడు తగివుండవచ్చునుగాని,

"నిట్టూ ర్పుగాడ్పులో
 ఫెళఫెళార్భటులలో
 హాలాహలమ్ములో