పుట:Neti-Kalapu-Kavitvam.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


57

నిదర్శనాధికరణం

అవుతున్నది గాని కావ్యంగాదు. ఇందుకే "వాక్యం రసాత్మమం కావ్యం" అన్న సాహిత్యదర్పణకారుడు

  "తత్ర వాక్యం యేధా శూన్యం వాసగృహం" ఇత్యాది "మహావజక్యం యధారామాయణమహాభారతరఘు వంశాది"   (సాహి) అనివినిపిస్తాడు.
    "వాక్యం రసాత్మకం కావ్యం" అన్నప్పుడు కావ్యాంశం వాక్యంలో వుంటుందని అభిప్రాయం యేకవాక్యమె కావ్యమైతే మేఘసందేశాదులు  మహామహాకావ్యాలు గావలెగదా మేఘసందేశాదులు ఖండకావ్యాలని విశ్వనాధుదు చెప్పుతున్నాడు మేఘసందేశంలోని ఒకశ్లోకమే కావ్యమైతే మేఘసందేశమంతా కలిసి ఖండకావ్య మెట్లా అవుతుంది? రసభావాలు పరిపొషంచెంది శ్రోతకు మన: పరిణతి కలిగించడంలొ కావ్యత్వసిద్ధి యేర్పడుతున్నది. చిరావస్థానం లేని అభిప్రాయాన్ని తెలిపే ఒకవాక్యంగాని ఒకమాటగాని అట్లాటిపనికి సమర్ధంగావు. సాహిత్య గ్రంధాల్లో అది రసం. ఇది భావం అని ఒక్కొక్కశ్లోకాన్ని ఉదాహరించడం ఉపదేశోపాయమని తెలుసుకోవడం దాంట్లో రసాంశ, భావాంశ, వున్న దని తెలుసుకోవలెను అది గాక ఈభావం, రసం భావత్వంచేత రసత్వంచేత మాత్రమే గ్రాహ్యం గావు ఆధారంయొక్క గుణాగుణాలు అధేయం  మీద ముద్రితమవుతున్నవి. ఈ సంగతి ముందింకా స్పష్టంగా విశదీకరిస్తాను రసం భావం గ్రాహ్యంకావడానికి  తదాధారమైన ఆలంబనం విదితమై అవి పరిపోషం చెందడానికి సాంగరూపసిద్ది కలిగేవరకు  ఉపస్థితంకావలెను. అప్పుడే మనకు ఉత్తమాభావ్యం సిద్ధించగలదు. అట్లాగాక ఆ చిరావస్వానమైన ఒక అభిప్రాయానికి నాలుగైదు ఉదాహరణలు వ్రాసి ఆమాటలను ప్రత్యేకంగా ఒక పేజీమీద ముద్రించినమాత్రాన అది ఒక కావ్యంగాదు. అవి యింపుగావుంటే వాటిని కావ్యాంశగల చాతూత్తు లనవచ్చును. ఆమనోహరోత్వం గూడా లేకుంటే అవి పనికిమాలిన చాందసపుమాట లవుతవి కృష్ణపక్షంలో ని విరిచేడె విశ్రాంతి శాపం, అబ్బ తొలకరిలోని మరపు గడ్దిపూలు మొదటిముక్క ఇట్లాటిఫన్నీ చాటూక్తులైనా అవుతని చాందసపు మాటలైనా అవుతని. ఈకాలపు ఖండ కృతుల్లో చాందసపుమాటలే