పుట:Neti-Kalapu-Kavitvam.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________

నిదర్శనాధికరణం

" వికృతక్రూరక్షుధాక్షుభితమృత్యుకఠోర

వికటపాండురశుష్క వదన దంష్ట్రాగ్ని లో నవ్వేలా" అని అన్నాడు. ఇప్పటికైనా విడిస్తే చాలు నని అనుకొన్నాను గాని ఆయన అట్లా విడువదలచలేదు.

"కన్నీటీకెరటాల వెన్నె లేలా?

నిట్టూర్పుగాడ్పులో సత్తా వియేలా"

అని వదలినాడు. ఈతీరుగా నీదర్శన పరంపరలు నిండినవి.

"ఆకులో నాకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనే నునులేత రెమ్మనై

| ఈయడవి దాగిపోనా?"

అనీ చెప్పి ఇట్లా అయిదుసార్లు 'అడవిలో దాగిపోనా' అని 'ఆుకునే కొమ్మనై, పూవునై, రెమ్మనై,' అని యింకా యేమేమో అని ఊరుకుంటాడు.

ఈ కాలపుపద్యాలకు ఈదోషం హెచ్చుగా కనబడుతున్నది.

ఆంధ్రహెరాల్డులో, బసవరాజు అప్పారావుగారు

"ఆమబ్బు మబ్బు ఆకాశమధ్యాన

అద్దు కున్నట్లు మనమైక్యమౌదామే".

అని ప్రియురాలిని ఉద్దేశించిన మాటలను అంటారు. ఆమాట అని ఈ కృతికర్త అంతటితో వూరుకోడు.

"ఆతీగె తీగె, ఆపోగు యీవాగు, అమాట మాట" అని మొత్తం నాలుగునిదర్శనాలు వేసి పూర్తి చేస్తాడు.

తీగె తీగెకలిసినా వాగువారు కలసినా అంతగా భావభేదంలేని యీనిదర్శనపరంపరలు నిరర్థక మంటున్నాను. సాహితిలో ఒకరు

"సంతత మడంగి యున్నె? నిసర్గగుణము

ఎంత ప్రతికూల వృత్తిలో నిరికియున్న

ఎంత యుత్సాహ జలధార లింకుచున్న

హృదయ మందున కవితాంశదృఢతనుండ

ఉండునే యది యుప్పొంగ కుండనెపుడు"

అని తన దుర్ని వారకవిత్వాన్ని ప్రతిపాదిస్తాడు. దీనికి