పుట:Neti-Kalapu-Kavitvam.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

వాఙ్మయసూత్ర పరిశిష్టం.

తృతీయాధ్యాయం

నేటి కాలపువిద్య

1. ఇంగ్లీషు పాఠశాలల్లో విద్య సంస్కృతపాఠశాలల్లో విద్య పద్య విద్య అని నేటికాలపు ఆంధ్రులవిద్య మూడువిధాలు.

2. ఇంగ్లీషుపాఠశాలల్లో భారతీయసంస్కారం నస్టప్రాయం.

3.పాశ్చాత్య భారతీయసంస్కారాల సమ్మేళనం విరశం

4.సంస్కృత పాఠశాలల్లో కావ్యపఠనమార్గం హేయం

5.భాషస్వాధీనమైన తరవాత, రసాస్వాదనశక్తియేర్పడ్డతరవాత రఘువంశం మొదలైనకవ్యాలు పఠించదగినవి

6.ప్రాయికంగా శాస్త్ర పఠనమార్గం అప్రశస్యం.

7.కనుక సంస్కృతపాఠశాలల్లో విద్యవల్ల భారతీయసంస్కార స్వరూప దర్శనమూ పరిణతిఫలమూ క్వాచిత్కం.

8. పద్యవిద్య విజ్ఞానశూన్యం

9. ఇదే ఆంధ్ర విద్య.

10. ఛందోవ్యతిక్రమంవల్ల భాషావ్యతిక్రమంవల్ల తెలుగుపద్యం కలుషితం

11. ఆంధ్రుల్లో సంస్కారోజ్జీవనం కార్యం కార్యం

అని శ్రీ - ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో తృతీయాధ్యాయం సమాప్తం. పరిశిష్ఠంగూడా సమాప్తం.