పుట:Neti-Kalapu-Kavitvam.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీ ర స్తు

వాజ్మయ పరిశిష్ట భాష్యం

నేటికాలపు కవిత్వం

ప్రధమాధ్యాయం

నూతనవత్వాధికరణం

నైషదతత్వజిజ్ఞాస ముగింపువాక్యంగా నేటికాలపు కవిత్వం అనివ్రాశాను ఇప్పుడు దీన్ని వివరిస్తున్నాను దీంట్లో నేడు అన్నా, నేటికాలమన్నా ఈపరిశిష్టం వ్రాసిన సమయని వ్యాఖ్యేయం నేడు ఆంధ్రదేశంలోఅనేకులు పద్యాలు వ్రాస్తున్నారు. చిన్నచిన్న కావ్యాలు కధాభాగం విశేషం లేకుండా కొందరు వ్రాస్తున్నారు. ఈ చిన్న కావ్యాలనే నేనిక్కడ ప్రధానంగా పరామర్శిస్తాను. వీటిని భావగీతాలని యిది భావకవిత్వమని కొందరంటున్నారు. ఇది మనకు నేటికి కొత్తగాలభించిందని చాలా ఉత్తమమయిన దని కొందరి అభిప్రాయము.

"ఈ దినములలో బావకవిత్వమనునది యొక్కటి బయలు వెడలిన దనియు అది శొచనీయస్థితియందున్నదనియు కొందరు వ్రాయుచున్నట్లు తోచెడిది '

కా.బ్రహ్మయ్య శాస్త్రి (భారతి)

ఈ రీతిగా ఈ చిన్నకావ్యాలను గురించి వేరు వేరు భావములు దేశంలో వ్యాపించియున్నవి వీటి నూతనత్వాన్ని వీటి హేయొపాదే యత్నాలను వివరించదలచి వీటి జీవనవిచారణకుముందు శరీరవిచారణ ఆరంభిస్తున్నాను. భారతి మొదలైన పత్రికల్లోవున్న ప్రణయపద్యాలు అనేక పద్యాల సముదాయరూపమైన కృష్ణపక్షంవంటి పుస్తకాలు యేకాంతసేవ కావ్యకుసుమావళి వనకుమారి లక్ష్మీకాంతతొలకరి బాపిరాజు తొలకరి యెంకిపాటలు నారాయణమ్మ చంద్రమ్మపాట యిటువంటివన్నీ యిప్పటి నావిచారణకు