పుట:Neti-Kalapu-Kavitvam.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

సమకాలాధికరణం.

పూర్వపక్షం.

అవునయ్యా; సమకాలపువారలు మెచ్చరే గదా అని అన్నట్లు మీరు సమకాలికులు గనుక వీటిని మెచ్చరు

"యే నామ కేచిదిహ నః ప్రథయత్యవజ్ఞాం,
 జానంతి తే కిమపి తాన్ ప్రతి నైష యత్నః.
 యథా స్త్రీణాం తదా వాచాం సాధుత్వే దుర్జనో జనః?"

అనిభవభూతి
  
"దిజ్నాగానాం పథిపరిహరన్"

అని కాళిదాసు
   
"మద్వాణి మా కురు విషాదమనాదరేణ,
 మాత్సర్యమగ్న మనసాం సహనాఖలానాం."

అని జగన్నాథుడు ఈతీరుగా తమకావ్యాలనువిమర్శించేవారిని గురించి అన్నారు మాకావ్యాలు మంచి వేనంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. క్షుద్రకులటలు సయితం ఈవాదం ఆధారం జేసుకొని పరిశుద్ధురాలైన సీతను లోకులు దూషించలేదా? అట్లానే మమ్మునుదూషిస్తున్నారు. అని వాదించ వచ్చును గదా? ఇది అసంబద్దవాదం ప్రాచీనుల్లో భవభూతి మొదలైన వారిని నిందించారు.