పుట:Neti-Kalapu-Kavitvam.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

ప్రజాధికరణం

పూర్వపక్షం.

అవునయ్యా, మేము ప్రజలకు మేలుచేసేవారము. అందుకోసం యిట్లా తోచినదంతా రాస్తాము అని అంటారా?

సమాధానం

నేను ప్రజలకు మేలుచేసే తరగతికి నన్ను నేనే యెక్కించు కొనలేనుగాని ప్రజల్లో ఒకడనని మాత్రం చెప్పుతున్నాను. ప్రజల్లో ఒకడైనా మీరు వ్రాసేదంతా చిల్లరశృంగారం పులుముడు, శబ్దవాచ్యత, అయోమయం, అని అది తుచ్ఛమని అంటున్నాను. మేము మేలుచేసే వారమని యింకా గర్వపడతారా మేలు చేయదలచిన మీకు మేలు చేసేతరగతివాడినని నేను గర్వపడగలను. కాని యివన్నీ అసంబద్ధపు మాటలు. ఒకరికి మేలుచేయడానికి ముందు మిమ్మును మీరు బాగుచేసుకోండి అని చెప్పుతున్నాను.

"స్వయం తీర్ణః పరాంస్తారయతి"

అని హితం పెద్దలు చెప్పుతున్నారు. ప్రజలకు సేవ జేయదలచితే భారతవర్షం సర్వోచ్చదశలో వున్నప్పటి మహాప్రష్టల వాల్మీకి వ్యాస కాళిదాసాదులకృతులు సుబోధమయ్యే పరిపాకం ప్రజలకు కలిగించడానికి యత్నించండి. అంతేగాని చిల్లర శృంగారం పులుముడు అయోమయం చూపి ప్రజలను వంచించ వద్దని చెప్పుతున్నాను.

అని శ్రీ..ఉమాకాన్తవిద్యశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో ప్రజాధికరణం సమాప్తం