పుట:Neti-Kalapu-Kavitvam.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావనాధికరణం

239

"The great poets of every age but the eighteenth have been romantic. What are Chaucer Shakespeare and Coleridge, if not romantic"

(అన్నికాలాల్లోను మహాకవులందరు రొమాంటికు కవులే అయివున్నారు. చాసరు, షేక్‌స్పియరు, కోల్రిడ్జిరొమాంటికు కవులుగాక మరెవరు?) అని

"What is really meant by all the phrases and by the name of the Romantic Movement, is simply reawakening to a sense of beauty and strangeness in natural things and in all the impulses of the mind and the senses"

ఈసమాసాలు రొమాంటికు మూమెంటు అనేపేరు వాస్తవంగా తెలిపేదేమంటే మనస్సుయొక్క తక్కిన యింద్రియాలయొక్క స్వభావగతుల్లోను ప్రకృతి సిద్ధపదార్థాల్లోను సౌందర్యాన్ని, వైలక్షణ్యాన్ని గోచరింప జేసే భావనావిస్తృతిని పొందించగల ప్రబోధం తప్పమరేమీగాదు". అని

"The quality which distinguishes the poetry of the beginning of the nineteenth century, the poetry which we roughly group together as the Romantic movement is the quality of its imagination and this quality is seen chiefly as a kind of atmosphere which adds strangeness to beauty."

"రొమాంటికు సరణి అనే పేరుగలిగి క్రీస్తు శకం 19-వ (కలి 50-వ) శతాబ్ది ప్రథశతాబ్ది ప్రథమభాగాన ఆకృతిపొందినకవితయొక్క విశేషలక్షణం దాని (ఉదాత్తభావాప్రకర్షరూపమైన), భావనాస్తృతి. సౌందర్యానికి వైలక్షణ్యమను సంధానం చేసే సంవిధానమే యీ విశేషంగా దృష్టమవుతున్నది" అని