పుట:Neti-Kalapu-Kavitvam.pdf/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్రీ గ ణే శా య న మ:వాలు పాఠ్యం

వాజ్మయపరిశిష్టభాష్యం.

భాధికరణం.

పూర్వపక్షం.

     అవునయ్యా మీరేదైనా అనండి ఇప్పటిది రొమాంటికు అంటే భావనాపటువైన కవిత (Romantic Poetry)  ఇది కొత్తది గనుక వెనకటి కవితకంటె చాలా మంచిది అనే అంటారా?

సమాధానం.

    చెప్పుతున్నాను. రొమాంటికు కవిత భారతవర్షానికి కొత్తగాదంటున్నాను. మనకూ ఆర్యావర్తానికి గలసంబందం గ్రీకు భిన్నులైన యూరోపునివాసులకూ గ్రీసుకూ గల సంబంధకంటె విలక్షణమైనది బారత వర్షసాహిత్యవిజ్ఞానానికి గ్రీకులాటిను భాషల విషయాలకూ అనుచితసాదృశ్యం కల్పించుకొనడం యూరోపుఖండ సాహిత్య చరిత్రను భారత వర్షానికి అవిచారితంగా తగిలించడం దాన్ని అప్రశస్తంగా అనుకరించడం అజ్ఞానం భారతవర్షానికి రొమాంటికు కవిత (Romantic Poetry)  కొత్తగాదన్నాను. ఇతిహాసదశ ననుసరించి మితార్ధంలో (Romantic Poetry) రొమాంటికి పొయట్రీ అనే మాటల నెట్లా అన్వయించినా బావనావృత్తితో ఉదాత్తభావప్రకర్షం గలది రొమాంటికు కవిత అని సాహిత్య వేత్తల అభిప్రాయం. ఈసంగతినే (Romantic movement in English Poetry) రొమాంటిక్ మూమెంట్ ఇన్ ఇంగ్లీష్ పొయట్రీ అనే గ్రంధంలో