పుట:Neti-Kalapu-Kavitvam.pdf/233

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


198

వాజ్మయ పరిశిష్టబాష్యం - నేటికాలపుకవిత్వం

మనుషుల శృంగారం వారికి భారతీయసంస్కారం లేని చిల్లర మనుష్యులకూ యింపుగావుంటే వుండవచ్చును గాని అది పరిణతబుద్ధులైన సాహిత్యవేత్తల జిజ్ఞాసల్లొ రసాభససంజ్ఞనే పొందుతున్నదంటున్నాను. మానవప్రకృతిలో శృంగారం కామసంబంది ఇది ధర్మంమీద లిల్వక పోయెనాన్ విషయలోలత్వం యెదుర్కొనడంసహజం. ఇక వేరేమధ్య మార్గంలేదు. ఇక మధ్యమర్గం పరిపోషంలేక సాధారణ విషయలోలత్వపర్యవసాయి అయినప్పటిది ఇది కావ్యానికి అర్హమైంది గాదు. కామంవల్ల శ్రేయోవిఘాతం క్షోభం విదితమే అయివున్నవి శృంగారం మిక్కిలి సునిశితమైన దని అది ప్రాకృతులచేతిలోదుర్వినియోగపడడానికి ఉమ్మఖమై వుంటుందని కనుకనే శృంగారనాయకుడికి అనురక్తలోకత్వలోకో త్తరగుణోత్తరత్వాదులు అవశ్యకమని అన్ని బారతీయసాహిత్యవేత్తల మాటలో అఖండసత్యం గర్బితమైవున్నదని వ్యాఖ్య ఛేశాను. వీరరౌద్రాద్బుతశాంతాలకు గూడా ఉత్తమనాయకు డవసరమన్న సాహిత్యవేత్తల అభిప్రాయాన్ని వివరించడం అప్రసక్తం దాన్ని నాటకాదికరణంలో పూర్తిగా వ్య్లాఖ్యచేశాను. కనుక ఇక్కడ వదలుతున్నాను. కరునహాస్యభయానక భీభత్సాలకు ఈతీరుగా లోకోత్తరగుణోత్తరనాయకులు అవశ్యకులుగారు. యెంతటిక్రూరుడైనా క్లేసాలపాలయితే అప్రయత్నంగానే అయ్యోపాపమంటాము. యెంతటి దుష్టుడైనా చచ్చాడని వినగానే అయ్యో అని విచారం తెలుపుతాము. రావణుడివంటితుచ్చ్యుణ్ని అనేకమైన ఆపదలకు కారణమైన వాణ్నిరాముడు చంపేదాకా ఉత్సాహవంతుడైదీక్షతో వున్నాడు గాని చనిపోగానే విభీషణుడు

"శోకవేగప్రెతాత్మా విలాబావ వ్చిభీషణ:" (వా రా)

అని దు:ఖపడ్డట్లు వాల్మీకి ప్రాణసాధారణస్వరూపాన్ని చిత్రిస్తున్నాడు. దుష్టులవిపత్తే యిట్లాక్వ్ జాలిపుట్టిస్తే యిక సాధారణుల విపత్తు జాలిపుట్టిస్తుందని చెప్పవలసిన పనిలేదు. కనుకనే యెంకిపాటల్లోని