పుట:Neti-Kalapu-Kavitvam.pdf/234

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


199

శృంగారాధికరణం

"దూరాన నారాజు కేరాయిడౌనో
ఈ రోజు నారాత లేరాలపాలో
సీమసిటు కనగానె సెదరిపోతదిమనసు
కాకమ్మ సేతైన కబురంపడారాజు
దూరాన నారాజు కేరాయుడౌనో
కళ్లకేటో మబ్బు
గమ్మిన ట్లుంటాది
నిదల్లె నాఒల్లు నీరసిస్తున్నాది
దూరాన నారాజు కేరాయుడౌనొ
ఆవు లంబాయంట అడలిపోతుండావి
గుండెల్లో వుండుండుఇ గుబులుబిగులౌతాది
దూరాన నారాజు కేరాయుడౌనొ
తులిసెమ్మ వొరిగింది తొలిపూస పెరిగింది
మనసులొ నాబొమ్మ మసకమసకేసింది
దూరాన నారాజు కేరాయుడౌనొ (యెంకిపాటలు)

"ఏగుడికి పోయినా హీనజాతంటారు
ఈశ్వరుడి కేజాలిరాదే చంద్రమ్మ
యెంతపాపం జెసినావే చంద్రమ్మ
యెండకొండాలేక నిండు సీకటిలేక

ముండ్లలో నేదబోతావే చంద్రమ్మ
ముందు గోదావరున్నాదే చంద్రమ్మ