పుట:Neti-Kalapu-Kavitvam.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

197

"వపు ర్విరూపాక్ష్య మలక్ష్యజన్మతా"

అని కాళీదాసీ అంశం ప్రస్తావిస్తాడు. కనుక ఆర్యులు అభినివేశంవల్ల చెప్పినా రనడం అక్రమం.

"తిర్యజ్మ్లే చ్ఛగతోపి వా"

అన్నప్పుడు మ్లేచ్ఛశబ్దం నీచత్వద్యోతకంగాని కులవాచిగాదు. జగన్నాధపండితరాయలవంటివాడు

"యవనీ నవనీతకోమలాంగీ
 శయనీయే యది లభ్యతే కదాచిత
"అవనీతల మేవ సాధు మన్యే
 న వనీ మాఘవనీ విలాసహేతు:"

అని మ్లేచ్ఛస్త్రీరతిని శ్లాఘించాడు. ఆశబ్దం నీచత్వద్యోతకంగాని కులవాచిగాదు కనుకనే సాహిత్యదర్పణకారుడు

"అధమపాత్ర తిర్యగాదిగతే"

అని మ్లేచ్ఛశబ్దంచేత ఉద్దిష్టమైన అర్థాన్ని వ్యాఖ్యాతుల్యంగా వివరించాడు. మ్లేచ్ఛశబ్దం అధమత్వద్యోతకంగాని కులవాచిగాదు. అధములైన చిల్లరమనుష్యులకంటె ధర్మసంబంధంగల పరిణతులు కావ్యశృంగారానికి యెక్కువ వుచితులని జనప్రకృతి మనోజ్ఞత్వం సాధారణుల ప్రేమమౌగ్ధ్యం భారతీయకావ్యాల్లో అంగంగావుండి ఔచిత్యవిలసితా లవుతున్నవని సాహిత్యవేత్తల అభిప్రాయం. దీన్ని నిరూపించాను. పరిణతిలేని చిల్లరమనుషులు బ్రాహ్మణులైనా గూడా వారు అధములే నని వారిశృంగారం సాహిత్యజిజ్ఞాసల్లో రసాభాసనామాన్నే పొందుతున్నదని అంటున్నాను. చిల్లరబ్రాహ్మణులు తక్కిన చిల్లర