పుట:Neti-Kalapu-Kavitvam.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

193


కాకపోయినప్పటికీ సుందరమైన చూపులను విశ్వాసాన్ని గలిగించే ఆగోపాంగనల ఋజుస్వబావాలను చూచి సంతొషించాడు. వివృత్తపార్శ్వమైనది సుందరమైన అంగహారం గలది పైకిలేస్తూవుండే నితంబంచేత రమ్యమైనది. కవ్వానికి అనుకూలమయిన తాళంగలది, అయిన గొల్లభామల నృత్యం శ్రీరాముణ్ని ఆనందపరచింది.

"విలాసా నాగరస్త్రీణాం న తథా రమయంతి నః
 యథా స్వభావసిద్దాని వృత్తాని వనయోషితాం"

(నాగరస్త్రీలవిలాసాలు స్వభావసిద్ధమైన వనవనితలవృత్తాల వలెమమ్ము ఆనందపరచలేవు.) అని

యిట్లాటి అమాయికప్రేమ మనోజ్ఞత్వాన్ని భారతీయులు ఔచిత్యాన్ని పాటించి అనేకవిధాల దర్శించారు. జింకలు తుమ్మెదలు మొదలైన సాధుతిర్యక్కులు సయితం ఈప్రేమమాధుర్య విషయాన భారతీయుల ఉదారదృష్టికి నీఛంగా కనబడలేదు.

"మధు ద్విరేఫః కుసుమైకపాత్రే
 పపౌ ప్రియాం స్వా మనువర్తమానః
 శృంగేణ సంస్పర్శనిమీలితాక్షీం
  మృగీమకండూయత కృష్ణసారః

 దదౌ రసాత్ పంకజరేణుగంధి
 గజాయ గండూషజలం కరేణుః,
 అర్ధోపభుక్తేన బిసేన జాయాం
 సంభావయామాస రథాంగనామా (కుమా)

(తుమ్మెద ప్రియురాలితోగూడా ఒకే పువ్వులో మధువును తాగించి: ఆడజింక స్పర్శసుఖాన కండ్లుమూసుకుంటూ వుండగా