పుట:Neti-Kalapu-Kavitvam.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

175


"ఓకాంతా నన్నుజూడూ

(మామునూరి నాగభూషణరావు)


"నన్నెవరేమంటేనేమి నీప్రేమబాగ్యంవుంటే నాకేమిభయం"

                                      

(గరిగిపాటి రామమూర్తి)


"నాకు రెక్కలుంటే నీవద్దవచ్చి వాలి ముద్దుపెట్టుకుంటాను"

                          

(నాదెండ్ల వెంకట్రావు)


"ఓతరుణీ నీకౌగిట్లోచేరి తనువుమరుస్తాను
 నామీద ఆకాశంపడ్డా భయంలేదు
 నా ప్రణయగాన శబ్ధాలకు విశ్వమంతాచలించి
 నిట్టూర్పు విడిచింది."

                          

(వేదుల సత్యనారాయణశాస్త్రి)


"చింతచెట్టుమీద గువ్వజంట సరస మాడుతున్నది
 చప్పుడైనప్పుడెల్ల నీవేవస్తున్నావని చూస్తున్నాను

                                    

(సౌదామిని)


"కలికీ నీవలపుదప్ప నాకు మరేమీవద్దు

               

(పువ్వాడ శేషగిరిరావు.చోడవరం జానకిరామయ్య.)


"దాని చీరకొంగు రాచుకున్నది నిద్రపట్టదు"

                                  

కవికొండల వెంకట్రావు


"ముద్దులొలుకు నీరూపు పిల్లా, మూర్చదెచ్చా వేమో పిల్లా"

అని యీతీరున భారతిలోని ప్రణయగీతం, ప్రణయసౌధం, ప్రణయోన్మాదం మొదలైనవాట్లో వ్యక్తమవుతున్నవి. కేవలం పశుత్వం వెల్లడించేవి అయిన యీమాటలన్నీ వినదగినది చెప్పుకోదగినది కాని క్షుద్రశృంగారమైవున్నవి. శాస్త్రగ్రంథాల్లో శబ్దవృత్తులు మొదలయినవాటికి లక్ష్యంగా ఉదాహరించే చాటుపద్యాలవంటివి యివంటారా? నాకు విప్రతిపత్తిలేదు. యివి వొక నూతనకవిత్వం ఉత్తమకవిత్వం అంటున్నందున విచారణ