పుట:Neti-Kalapu-Kavitvam.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

శృంగారం ఆధారంగా ఉదాత్తభావోన్మీలనం అయినప్పుడే అది మనకు స్వీకార్యమన్నాను. విశ్వనాథు డన్నట్లు ఉత్తమప్రకృతులై అనురక్తలోకులై శీలవంతులై ధర్మతేజస్సుతో పరిణతులై ఉత్తమ సంస్కారప్రాప్తితో ఉదాత్తులైన నాయకులందే ఇట్లాటి దశసిద్ధిస్తున్నది. అప్పుడాశృంగారం శ్రోతవ్యమవుతున్నది. దానివల్ల ఆనందమేగాక నాయకనిష్ఠమైన వీరత్వ తేజశ్శాలిత్వ శీలవత్వాదులమీద అనురక్తీవాటివల్ల లోకాభ్యుదయానికి అనుకూలమైన కల్యాణగుణాభిరతీ నాంతరీయ కఫలాలుగా సిద్దిస్తున్నవి. యీసంగతి రఘువంశకుమారసంభవోత్తర రామచరిత్రాదులవల్ల విదితమవుతూనేవున్నది. వీట్లో వృత్తాంతం యొక్క శ్రవణం యిట్లాటి ఆనుషంగిక ఫలాల ప్రదానానికి సమర్థమయ్యే వున్నది. ఇట్లానే ఉదాత్తనాయికానిష్ఠమైన కల్యాణగుణాలపై అనురక్తిసయితం ఆనుషంగికంగా సిద్దిస్సున్నది.

ప్రాకృతులు--కామప్రేమ

కేవల కాముకులశృంగారం క్షుద్రమని నిరూపించాను. ఇక కేవలం ప్రాకృతదశలోవుండే మనుషులశృంగారం క్షుద్రమనిచెప్పవలసిన పనిలేదు. కేవల కాముకుల్లోను ప్రాకృతుల్లోను రూపప్రేమే ప్రధానమవుతున్నది. ఈరూపప్రేమ అవయవసన్ని వేశం మొదలైన బహిరాకారంమీద ఆధారపడి వుంటుంది. యీ ఆకారానికి వికృతిగలిగినప్పుడు ప్రేమకూడ వికృతి జెందవలసివస్తుంది. కారణగుణం కార్యంలో సంక్రమించడం ప్రసిద్దిమేగదా. యీప్రాకృతమైన కామప్రేమ పశుప్రేమ. వీటి నన్నిటిని దాటి ప్రేమ గుణాలమీద అధారపడ్డప్పుడే పవిత్రమైన లోకాభ్యుదయానికి హేతువగుతున్నది. రూపంమీద ఆధారపడ్డ ప్రేమ విషయలోలత్వానికి మాత్రం హేతువగుతున్నది. కనుకనే కవికుల గురువు కాళిదాసు

"అరూపహార్యం మదనస్య నిగ్రహాత్" (కుమార)