పుట:Neti-Kalapu-Kavitvam.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


గౌరవించి ఊరేగించి వారిఆనందమే మనకు తృప్తిగా ప్రవర్తిస్తామని వారిశృంగారం మనకు గ్రాహ్యమై వర్తిస్తున్నదని విశదపరచాను.

"ఆరాధనాయ లోకస్య"

అన్న శ్రీరాముడు ఉత్తరరామచరిత్రలోను సర్వధర్మాలకు నిలయంగా

"అనేన ధర్మః సవిశేషమద్య మే
 త్రివర్గసారః ప్రతిభాతి భావిని"

అనేమాటలు వెలువరించజేసి వెలువరించగలిగిన లోకపితలు పార్వతీ పరమేశ్వరులు కుమార సంభవంలోను ఉత్తమశృంగార నాయకులై భారతీయకావ్యంయొక్క ఔత్కృష్ట్యాన్ని ప్రకటిస్తున్నారని తెలిపినాను. ఇక కేవలం సాధారణకాముకులు వారి పెండ్లాన్ని ముద్దుపెట్టుకొని బుజాలమీద యెక్కించుకుంటే యెక్కించుకో వచ్చును. అది మనకు విచార్యంగాదు ఇట్లాటికాముకుడు పూలదండలువేసుకొని కులుకుతుంటే పూల రంగడంటాము ఒకప్పుడు అట్లాటి కేవలకామేచ్ఛారూపమైన పశుభావాలే మనలోప్రేరితంకాగలవు. ధర్మతత్పరులైన ధీరుల శృంగారం మనకు ఇట్లాటి భావనలను కలిగించదు. పైగా నిర్మలదాంపత్యం మీద అభిలాష అవిర్భవింపజేస్తుంది. అందుకే పత్నులతోకూడిన ఋషులను పరమేశ్వరుడు చూచినపుడు.

"తద్దర్శనాదభూచ్చంభోః భుయాన్ దారార్థమాదరః"

(వారిని చూడడంవల్ల శివుడికి భార్యా స్వీకారంమీద ఆదరం హెచ్చుగా గలిగింది) అని కాళిదాసన్నాడు. యెందుకు? కామతృప్తికి గాదు.

"క్రియాణాం ఖలు ధర్మ్యాణాం సత్పత్న్యో మూలకారణం"

(ధర్మసహితమైన క్రియలకు సత్పత్నులేగదా మూలకారణం అని వెంటనే కాళిదాసంటాడు. కేవలకామరూపమైన వృత్తి ప్రేరితమైతే యేమంటారా?