పుట:Neti-Kalapu-Kavitvam.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

171

"జగదధీశ్వరుడైన మహేశ్వరుడియందుగాని, జగదంతరాత్మ అయిన జనార్దనుడియందుగాని, నాకు వస్తుభేద ప్రతిపత్తి లేదు. అయినప్పటికీ తరుణేందు శేఖరుడియందే నాకు భక్తి" అని}}

"శైవా వయం నఖలు తత్ర విచారణీయం
 పంచాక్షరీజపపరా వితరాం తథాపి
 చేతో మదీయమతసీకుసుమావభాసం
 స్మేరాననం స్మరతి గోపనధూకిశోరం"

(మేము శైవులం అందులో విచారించవలసినది లేదు. మేము అధికంగా పంచాక్షరీజపరాయణులం అయినప్పటికీ నాచేతన్సు అతసీ కుసుమావభాసుడూ స్మేరాననుడూ అయిన గోపవధూకిశోరుణ్ని స్మరిస్తున్నది) అని భర్తృహరి లీలాశుకులూ అన్నట్లు వాస్తవంగా హృదయమార్గాలు దుర్గ్రహం.

"వ్యతిషజతి పదార్థాన్ అంతర: కోపి హేతు:" (మాలతీ)

(యేదో ఒక అనిర్వాచ్యమైన అంతరహేతువు పదార్ధాలను కలుపుతున్నది) అని భవభూతి ఈసత్యాన్నే ప్రకటిస్తున్నాడు. ఇంతకూ చెప్పదలచిన దేమంటే హృదయానికి ధర్మక్షాళనం హృదయమార్గాల దుర్గ్రహత్వంతో సంబద్ధమయ్యే వున్నదని శృంగారం ఉపాదేయం గావడానికి లక్షితం గావలె నని చెప్పుతున్నాను.

సాధారణులు - చిల్లర శృంగారం

ఇక సాధారణుల శృంగారాన్ని చర్చిస్తాను. ధర్మంగాని అధర్మంగాని యెరగక యెవరిపొట్టవాండ్లు పోసుకునేవాండ్లు సాధారణులు వీరు కాముకులైనప్పటి శృంగారాన్ని చర్చిస్తాను వీరిశృంగారం గ్రాహ్యమా అని విచారణచేస్తాను. లోకశ్రేయస్సుకు త్యాగంచూపే మహాత్ములను