పుట:Neti-Kalapu-Kavitvam.pdf/208

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
173
శృంగారాధికరణం

కేవల కామం విషయలోలత్వాన్ని విషయలోలత్వం బుద్ది నైర్యల్యానికి ఆచ్చాదనాన్ని ఆత్మవినాశాన్ని కలిస్తున్నవి అది కేవలం పశువృత్తి. అగ్ని పర్వతంనుండి పొంగే ప్రవాహంవలె లేచిన బిల్హణుడి అద్యాపి స్మరణాలు సర్వలోకంలో కాముకశృంగారకోటిలో ప్రథమ స్థానం ఆక్రమించదదివున్నా అవి బిల్హణుడికి కాళిదాసాదుల కీర్తివంటి ఉత్తమకవితాకీర్తినితేలేదు. చివరకు ఆతనిమనస్సు మోటుదనాన్ని తెలిపే కథనుగూడా లోకం అతనికి తగిలించింది.

"రాజుద్వారే భగాకారే విశన్తి ప్రవిశన్తి చ
 .....వత్ పండితాః సర్వే బిల్హణో వృషణాయతే"

అనేకథ ఆతని మోటుకామపు ప్రవృత్తికి తగేవున్నట్లు నాకు తోస్తున్నది. కేవల కాముకత్వం విషయలోలత్వాన్ని విషయలోలత్వం ఆత్మవినాశాన్ని కలిగిస్తవి గనుక అపేక్ష్యం గాదంటున్నాను. అది గాక శృంగారం మిక్కిలి సునిశితమైనది. అది యేమాత్రం హద్దుమీరినా మితిమీరినా క్షోభమేకలుగుతున్నది. లోకంలో అనేకమైన హింసలు పీడలు, హత్యలు అలజడులు దేహాత్మల నైర్మల్యవినాశాలు ఈశృంగార దుర్వినియోగంవల్ల గోచరిస్తున్నవి. ఇది ధర్మసంబంధి అయినప్పుడే లోక శ్రేయస్సుకు తోడ్పడుతున్నది. అర్ధకామప్రేరితమాయెనా అత్యంతం అనర్ధ హేతువగుతున్నది. ఇది ముడిదశలో మోటుపనులనే వెలువరిస్తున్నదిగాని ఉదాత్తస్వరూపాన్ని ప్రకటించజాలదు. ఈ ప్రాకృత ప్రవృత్తిలో మనకు విచార్యంగాదు. కోళ్లు కుక్కలుకూడా యీప్రవృత్తిలో వుంటున్నవి కనుకనే సాధారణుల శృంగారం గ్రాహ్యంకా దంటున్నాను. "చెన్నపట్టణంలో" అనే మొదలయిన యిప్పటినవల అనేకంలోను భారతిమొదలయిన పత్రికల్లోని "పరీక్ష" సర్వదర్శినిలోలక్కులు" మొదలైన కథలవంటి కథల్లోను వుండేది యీ అనుపాదేయమైన శృంగారమే అయివున్నది.