పుట:Neti-Kalapu-Kavitvam.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగారాధికరణం

157

"క్రౌంచద్వంద్వవియోగోత్థః శోకః శ్లోకత్వమాగత:"

అని ఆనందవర్ధనుడు కీర్తించిన క్రౌంచద్వంద్వవియోగం అధారంగా సీతారామ సంయోగ వియోగాలను వెలయించిన వాల్మీకికృతిని లోకంలో వున్న సమస్తకావ్యజాతంలో మహోన్నతస్థానం పొందదగ్గ రామాయణాన్ని ప్రశంసిస్తూ

"యత్ర ప్రవృత్తికాస్త్రార్ధం సమ్యగేవ నిరూపితః"

(పారాశర్యోపపురాణం)

(యెక్కడ ప్రవృత్తిశాస్త్రార్ధం బాగా ప్రకాశితమయిందో)

అని అన్నారు సంయోగంతో వియోగం సంబద్ధమైనది గనుక వియోగం సంయోగ సంబంధి అయి సంయోగవియోగాలు రెండూ శృంగార మవుతున్నవి ఈ తీరుగా శృంగారం గ్రాహ్యంమాత్రమేగాకుండా సమస్త జగత్థ్సితికి హేతువుకావడంవల్ల ప్రధానమనిగూడా నిరూపించాను. ఇట్లా ప్రవృత్తిమార్గాన్ని చేపట్టిన కావ్యం ప్రవృత్తి హేతుభూత మయిన సంయోగాన్ని స్వీకరించడం అత్యంతం ఉచితమన్నాను. ఇందుకే భారతీయులు కవిత్వోన్నతికి ఆకరమైన నాటకంలో శృంగారం (వీరమైనా) ప్రధానమన్నారని వ్యాఖ్య చేస్తున్నాను. వీరాన్ని గురించి నాటకాధి కరణంలో వివరించాను గనుక యిక్కడ వదలుతున్నాను. వేదాంతజిజ్ఞాసలు సంపూర్ణంగా బలం ప్రాపించినతరువాత శాంతాన్ని గూడా రసకోటిలో సాహిత్య వేత్తలు స్థిరపరిచినట్లు కనబడుతున్నవి. భరతుడు శాంతరసం చెప్పకపోయినా

"నిర్వేదస్థాయిభావః శాంతోస్తి నవమో రసః" (కావ్య)

అనిమమ్మటాదులు శాంతాన్ని ప్రతిపాదించినవిధం

"నిర్వేదస్యామంగళప్రాయస్య ప్రథమమను పాదేయత్వే 7 పి ఉపాదానం వ్యభిచారిత్వే 7 పి స్ధాయిత్వాభిదానార్ధం" (కావ్య)