పుట:Neti-Kalapu-Kavitvam.pdf/193

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


158

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

అని దాన్ని సమర్ధించిన విధం శాంతం రసకోటిలో స్ధిరపడ్డమార్గాన్ని చూపుతున్నవి.

   ఈ సంగతి సంపూర్ణంగా వాజ్మయదర్శనంలో మరియొకచోట మీమాంస చేశాను. గ్రంధవిస్తర భీతిచేత యిక్కడా వదలుతున్నాను. ఇది యింత ప్రధానమైనది గనుకనే.
   "శృంగార ఏవ మధుర: సర: ప్రహ్లాదనో రస:"

అనిద్వనికారుడు కీర్తిస్తున్నాడు.

  ఇక యెంకిపాటలు శృంగారం భారతిలో ప్రణయజానకి ప్రణయగీతం ప్రణయగానం, మొదలైనవాటిలోని శృంగారతత్వమేమిటి? అని విచారిస్తాను.

శృంగారే విచారణ

  శృంగారం లోకసంతతికి (అవిచ్చిన్నతకు) ప్రేరకమని అందువల్ల మనకు గ్రాహ్యమని అన్నాను. ఇది ధర్మతత్పరులయందు నిష్ఠమైనప్పుడు లోకాభ్యుదయహేతువై ఉపాదేయ మవుతున్నది. ధర్మతత్పరమైన జగత్సంతతి అబీష్టంగాని అధర్మ తత్పరమైన జగత్తు యొక్క అవిచ్చిన్నత త్యాజ్యమెకదా కనుక దర్మతత్పరులలో నిష్ఠమై శృంగారం ఉత్తమత్వం ఆరోహిస్తున్నది.

పూర్వపక్షం

 శృంగారం లోకసంతతికి ప్రేరకం కావడంవల్ల గ్రాహ్యమంటే మేము వొప్పుకోము అది కుమారస్వామి రత్నాపణంలో అన్నట్లు సర్వప్రాణి హృదయంగమం గనుక గ్రాహ్యం అందుకే
  "శృంగార ఏవ మధుర: పర: ప్రహ్లాదనో రస:"   (ద్వన్యా)