ఈ పుట ఆమోదించబడ్డది
శృంగారాధికరణం 155
అనేశ్రుతివాక్యాల ఊతతో నిత్యనైమిత్తిక కామ్యకర్మలను ప్రేరేపించి జగత్తుయొక్క అవిచ్ఛిన్నతను ఆరాధించే ప్రవృత్తిమార్గం లోకంలో చిరప్రతిష్ఠితమై వున్నది.
"సా భావయిత్రీ భావయితవ్యా భవతి తం స్త్రీమ్గర్భంమ్భిభర్తి సోగ్రఏవకుమారం జన్మనోగ్రేధిభావయతీ సయత్ కుమారం జన్మనోభేధిభావయతి ఆత్మానమేవ తద్భావయతి...ఏవం సంత తాహీ మే లోకాస్తదస్య ద్వితీయజన్మ." (ఐతరే) అని ఇతరైయోపనిషత్తు ఆదేశించిన జగత్సంతతిని,(జగదవిచ్ఛిన్న తను) "ధర్మం జైమినిరతఏవ." (బ్రహ్మ) అని పూర్వపక్షవాదులు సయితం గౌరవార్థం ప్రస్తావించిన జైమిని, జ్ఞానానికి కర్మాంగత్వ మారోపించి ప్రవృత్తినే ప్రతిష్ఠించిన జైమిని. వాస్తవంగా ఆరాధించిన వాడవుతున్నాడు.
"సంతతిః శుద్ధవంశ్యా హి పరత్రేహ చ శర్మణే" అన్న కాళిదాసవాక్యాలు ఈ జగదవిచ్ఛిన్నతయొక్క రూపాన్ని తెలుపుతున్నవి. ౧. "స్వాద్వన్న భక్షకామేన వేషోయం యోగినాం ధృతః." ౩. స్థితోసి యోషితాం గర్భే తాభిరేవ వివద్గీతః అహో కృతఘ్నతా మూర్ఖ కథం? తా ఏవ నిందసి. (మండనః.) ౩. యాసాంస్తన్యం త్వయా పీతం యాసాం జాతోసియోనీతః తాను మూర్ఖతమ స్త్రీషు పశువద్రమసే కథం.? ౪. మన్యే మైధునకామేన వేషోయం కర్మిణాం ధృతః. (శంకరః.)