ఈ పుట అచ్చుదిద్దబడలేదు
95
శబ్దవాచ్యతాధికరణం
వ్యక్తమవుతున్నవని చెప్పుతున్నాడు అట్లానే కఠోరత్వాన్ని తెలపడానికి క్రూర, కఠోర అని యిట్లాటి మాటలను ప్రయోగిస్తున్నాడు. దీంట్లో దోషం లెదంటారా?
సమాధానం
చప్పుతున్నాను; వాస్తవంగా మాధుర్యం మీదా మార్ధవం మీదా అభినివేశం వుంటే కళాసృష్టిలో ఆబావాలను గర్బితం జేసి ప్రకృత్ చేష్ఠాదులవల్ల వాటిని తెలుపవలెనుగాని ఊరికే మధురం మంజులం బందురం అని చెప్పడం చేతగాదు చెప్పినంతమాత్రాన లోకం అనుకోజాలదని పైగా వెగటుపడుతుందని తెలిపినాను. ఈ ఔచిత్యం యెరిగిన వాడు గనుకనే కవికాళిదాసు తపోవనాల శాంతిని మాధుర్యాన్ని తేజస్సును అత్యంతం అరాధించేవాడే అయినా రాముడడిగినప్పుడు
"అదష్టనీవారబలిని హిత స్త్రె। సంబద్దవైఖానసకన్యకాని
ఇయేష భూయ। కుశవంతి గంతుం భాగీరరధీతీరతపోవనాని"
(రఘు)
(క్రూరమృగాలు తినని నీవారబలులు గలిగి మునికన్యలకు ప్రీతిజనకమై. దర్బలతొ కూడివున్న భాగీరధీతీర తపోవనాలకు పోవలెనని ఆమె కొరింది) అని అన్నాడు "దివ్యమై పవిత్రమై శాంతినిలయమై' అని యీతీరున శబ్దవాచ్యత పాలుగా లేదు.
పూర్వపక్షం
అవునుసరే; ఊరికే నేను తెలివిగలనాడను గొప్పవాడను అని చెప్పుకుంటే రోత అన్నారు. ఒప్పుకుంటాము. నిజంగా తెలివిగల పనులు చేస్తూ గొప్పకార్యాలు సాధిస్తూ నేను గొప్పవాణ్ని నేను తెలివిగలవాణ్ని అని చెప్పుకుంటే యేమి? అది సత్యమే గదా శ్రీనాధుని కాశీఖండంలో మేమారెడ్ది తన్ను గురించి