పుట:Neti-Kalapu-Kavitvam.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


________________

అయోమయత్వాధికరణం

ఆక్షేపం.

అవునండీ, చెప్పవలసినది లేనప్పుడు వ్రాస్తే అయోమయ మంటారు. చెప్పదలచుకున్నది చెప్పడానికి కావలసిన బలం లేనప్పుడు వ్రాస్తే అయోమయ మంటారు. వచ్చీరాని సంస్కృతంవ్రాస్తే అయోమయ మంటారు. అభిప్రాయము మామూలుడై దాన్నీ మెలికలు వేస్తూ వ్రాస్తే అయోమయ మంటారు. ఈ అయోమయమైనా వ్రాస్తే మంచిది గదా, యేమి వ్రాయకుండావుంటే వాజ్మయం యెట్లా వృద్ధిఅవుతుంది? అని అంటారా? "

సమాధానం.

చెప్పుతున్నాను; అయ్యో! కవిత్వంవ్రాసేవాండ్లు లేరే అని దుఃఖించి కవిత్వంవ్రాయవద్దు. యేమి వ్రాయకుండావుంటే యేమి మునిగిపోలేదు. మనకు కాళిదాసాదులకవిత్వం యుగయుగాలవరకూ ఆనందపారవశ్యం కలిగించగలిగినది వున్నది. కవిత్వం లేదుగదా అనీ దుఃఖపడవలసిన పని లేదు. ఇఘ ఆంధ్రులను పవిత్రులను జేసి సర్వభారతవర్షానికీ సర్వలోకానికీ సందేశమిచ్చే కవిత్వం పద్యరూపానగాని గద్యరూపానగాని వస్తుందా దాన్ని ఆంధ్ర దేశం శిరసావహించగలదు, కాని యిప్పుడు కవిత్వం కొరతగా వున్నదని దుఃఖపడి మాత్రం వ్రాయవద్దంటున్నాను.

అని శ్రీ...ఉమా కాస్త విద్యాశేఖర కృతిలో వాజ్మయసూత్ర

పరిశీష్టంలో అయోమయత్వాధీకరణం సమాప్తం..