పుట:Neti-Kalapu-Kavitvam.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


78

వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం

అని శబ్ద ఉత్వజ్ఞలు చెప్పుతున్నారు.

    పతంజలి "కుంభకారకులం గత్వా" (మహా) అన్నట్లు భావనెవరూ చేయలేరని భారతీయుల సిద్ధాంతం ఒక వేళ చేస్తారని వొప్పుకున్నా దీన్ని ముందుకాలపువాండ్లు యెట్లా నేర్చుకుంటారు? సాధనాలు వేరే యేర్పరచారంటారా? వీటికి ప్రామాణ్య మేమిటి? పోనీ అట్లాటి వేమైనా వుంటే మాకెందుకు ప్రసదించగూడదు? ముందుకాలపువాండ్లు యింకా తెలిగలవాండ్లవుతారు గనుక వారికి తెలుస్తవంటారా? అది అసంబద్ధం పాణిని పతంజలి ప్రభృతులు వ్రాసిన శాస్త్రాల్ను యెన్నో సంవత్సరాలు పరిశ్వమజేసి సంస్కారవంతుల మవుతున్నాము. వెనకటి కాలపువారికంటే ముందుకాలపువారు యెక్కువ బుద్దిమంతులవడం అనుచితం నాట్యశాస్త్రంలో

"భవిష్యతి యుగే ప్రాయో భవిష్యంత్యబుధా నరా;"(భ.నా)

భష్యత్కాలంలో నరులు అబుధులవుతారు అని భరతుడు అన్నాడు పోనీయండి ముందు రాబొయ్యేవారికంటె యిప్పటివారు తెలివితక్కువవారనే వొప్పుకుందాము. ఈ తెలివి తక్కువ వారికే దాన్ని విప్పి చప్పండి అంటున్నాను. చెప్పినా తెలియదంటారా? తెలిసేటట్టు చెప్పండి

"వక్తురేన హి తజ్జాఢ్య శ్రోతా యత్ర వ బుధ్ద్యతే"
(వినేవాడికి తెలియకపోవడం వక్తయొక్క జాడ్యమేను)

అని పెద్దలుచెప్పుతున్నారు. అధికారులు లెదంటారా? ఒకరైనాలేరా? కొందరు బీరువులై అటుభార్యకు తగిలేటట్లు అయోమయంగా రచిస్తున్నారు. వ్రాయదలచుకుంటే నిర్భయంగా జగన్నాదాదులవలె భార్యనుగురించి వ్రాయండి లేదా దేవతమీద భక్తిని శ్రీగుణరత్నకోశం, సౌందర్యలహరి మొదలయినవాట్లోవలె కంబరచండి ఇదే ఉత్తమమార్గం భీరుత్వం అయోమయం అధమమంటున్నారు