పుట:Neti-Kalapu-Kavitvam.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయోమయత్వాధికరణం

77


పద్యాలుగావు; సౌందర్యభావన దర్శనమాత్రాన్నే కలుగ వ లెనుగాని కండ్లూ, ముక్కూ. చెవులూ, కండ్లకు దగ్గిరగాపెట్టుకొని చెక్కిపై తోలుతీసి పరీక్షిస్తే సౌందర్యస్పురణానికే మూలక్షయం కలుగుతుంది.

ఆక్షేపం.

ఇవి యీకాలంలో తెలియవు. ముందుకాలంవారుగాని వీటిలోతు కనుక్కోరు. అందుకే భవభూతి

"కాలో హ్యయం నిరవధిర్విపులా చ పృథ్వీ" (మాలతీ) అన్నాడు అని అంటారా?

సమాధానం.

చెబుతున్నాను; అది అసంబద్ధం. తనకావ్యాన్ని కొందరు గౌరవించకపోతే మీరు కాకుంటే మీతరువాతవారు దాన్ని గౌరవిస్తారు అని అన్నాడు.

"ఏకో రసః కరుణ ఏవ" (ఉత్తర)

అనే యిట్లాటి నూతనసిద్ధాంతాలను వారు అంగీకరించకుంటే వాటిలో సత్యమే ఉన్నట్లయితే ముందు వారంగీకరిస్తారని అతడి అభిప్రాయం. అంతేగాని భవభూతి తననాటకాలను అయోమయంగా వ్రాసిముందువారి కివి తెలుస్తవనలేదు. భవభూతినాటకాల్లో యెక్కడా యేమాత్రం అయోమయత్వం లేదు. ఒక వేళ ముందుకాలపువారి కని ఒప్పుకుందాము. అవి ముందుకాలపువారికే అయితే యిప్పుడే అచ్చువేయించి అమ్మడం యెందుకు? యీమాటల కర్థం మారింది గనుక అవిముందుకాలంవారికి తెలుస్తవంటారా? ఆమారిన అర్థాలెవరికీ తెలియకుండా పద్యకర్త కొక్కడికే యిప్పు డెట్లా తెలిసినవి? ముందు కాలపు వారి భాష వీరికెట్లా వినబడ్డది? వీరు కొత్తగా అయోమయపు భాషను సృష్టించారంటారా?

|"నిత్యాః శబ్దార్ధసంబంధాః" (వాక్యా)