పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


దానిచేఁ దనదౌష్ట్యంబె కానసగును;
గాని, వచ్చులాభము లేశమైన లేదు.

తే. కొలువుకుదిరినవానిని, గూర్మితోడఁ
గనుచునుండినఁజేసెడిపనిని వాఁడు
తనమనఃపూర్తితోఁజేయు; దానఁ, బనియు
మేలుగానుండు గనరెరువేళకన్న

ఆ. ప్రేమఁజూడబ, డినభృత్యుండు,నిత్యంబు
స్వామిభక్తిగలిగి, సలుపుఁబనులు
ప్రభవుమీఁది ప్రేమఁ, ప్రాణంబులనునిచ్చు
సరకుగొనక, కొన్ని సమయములను.
                   పాటు పడుట

ఆ. ధరణిని సకలంబు దైవంబుసృజియించి,
పాటుపడెడువాని పాలుచేసెఁ;
బాటు పడినచోట, ఫలియించునన్నియుఁ
బాటుపడకయున్న, ఫలిముగలదె?

ఆ. తగినపాటుదేహదార్ఢ్యంబు వెలయించుఁ;
దగినపాటు మేనితెగులు మాన్చుఁ;
దగినపాటు కలిమిఁ దప్పక కలిగించుఁ;
బాటుపడుటతోడ సాటిగలదె?

ఆ. పాటులేక దేహపాటవం బడఁగును;
పాటులేక సౌఖ్యపదవి తగ్గుఁ;
బాటులేకయొడల బహురోగములుచేరుఁ
బాటులేనిసౌఖ్య పాటులేదు.

ఆ. ఇట్లుజరిగియుండ, నింతటిసిరు లుండ
భృత్యులింతమంది బెరసియుండ