పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తమ్ముమించువారు తమకట్లుచేసిన,
నెట్టులుండునొక్కొ యెఱుఁగలేరు. 36

ఆ. అల్పజంతువులకు హానిఁజేయుచునున్న;
నంతకంతకదియె స్వాంతమునకు
బట్టువడుచుఁబిదపఁ జెట్టలనరులకుఁ
జేయుబుధ్ధిపుట్టఁ జేటుమూఁడు. 37

ఆ. దోమమొదలు పెద్దసామజంబువఱకుఁ
గలుగుజంతువులక కారణంబు,
బాధసేయకుండవలయును సతతంబు:
హింసకూడద నెడియెఱుకగలిగి. 38

ఆ. ప్రాణికోటియెడలఁ మాయనిదయగల్గు
వారియందు, దైవమారయంగఁ
గరమనుగ్రహంబు గలిగియుండునుఁ గాన,
హింససేయఁగూడ దించుకైన. 39
            సర్వజన సమాదరము. 39

ఆ. గొప్పవారలైనఁ గొంచెపువారైన
నన్నదమ్మలగుదు రరసిచూడ
దైవమొకనివలనఁ దారందఱునుగల్లి
యొక్క పుడమియందెయుండుక తన. 40

ఆ. కాన, భేదబుధ్ధి గల్పించుకొనిత్రుళ్ళి
పడక, యెపుడు లేనివారిఁ గన్న
నాదరింప వలయు సోదరభావంబు
తోడఁ, జేతనైనతోడుసూపి. 41

తే. అవనిలోపల, నధికార మబ్బెనేని
క్రిందవారల నెప్పుఁడుఁగినియఁదగదు;