పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నేనుబనులఁజేయ నేల? యవకొకింత
కాయకష్టమెపుడుఁజేయవలయు. 48

ఆ. కష్టపడుట మంచి కార్యంబటంచును
గానిపనులయందుఁ గష్టపడకు;
హానికరము కరమునతికాయకష్టంబుఁ
బుడమిలవముఁగష్టపమిఁబోలె. 49
               శరీరారోగ్యము.

తే. అన్నిటికి ముఖ్య మాత్మదేహంబునందుఁ
గొఱఁతరాకుండఁగాపాడుకొనుచునుంట;
తాను దిన్నఁగాఁదిరిగెడుతఱినిగాదె
సర్వధర్మములును జేయశక్తుఁడ గుట. 50

తే. మానవుండు దేహారోగ్యమూనుకొఱకుఁ
బ్రతిదినంబు నెనిమిదైనఁ, బదియునైన
గంటలవఱకు, మేనికిఁగాని, మదికిఁ
గానితగినంతపనిగల్లి క్రాలవలయు. 51

తే. ప్రాలుమాలక, స్నానంబుబ్రత్యహంబుఁ
జేయుచును, మేనిముఱికెల్ల బ్రాయునట్లు
కాయమంతయు శుభ్రముగాఁగఁదోము
కొనఁగవలయు, నారోగ్యంబుగోరువారు. 52

తే. అట్లుపనిఁజేయుపిమ్మట, ననుదినంబు
కొంతసేపైన, నుత్సాహ మింతగలుగు
వేడుకలఁబ్రొద్దుపుచ్చుదు, వెనుక, రాత్రి
యేడెనిమిదిగంటలునిద్రఁగూడవలయు. 53

తే. ప్రతిదినంబును, దాఁజల్ల పాటువేళ,
బయలఁ దప్పకయొకగంటవఱకునై నఁ