పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


దిరుగవలయును, దేహంబుదృఢతగాంచి
యెపుడుఁదరుగంగ సత్వంబునిచ్చుకొరకు. 54

ఆ. కల్మషోదకంబు గలిగించువ్యాధిని;
నిర్మలోదకంబు నిలుపుదానిఁ,
దెలిసివడియఁగట్టుజలమె గ్రోలఁగఁదగు,
సౌఖ్యమందఁదలఁచు జనుఁడువినుఁడు. 55

తే. మితముతప్పిభుజించుట మేరగాదు;
మిగులఁగుడిచిన, నొడలికిఁదెగులుగలుగు,
దనకడుపు నిండినను బంచదారనైన,
విషముభంగినిదలపోసి, విడువవలయు. 56

ఆ. రేయిపగలు మంచివాయువు వచ్చెడు
మాగ౯ములనుగలిగి, మందిరంబు,
పజ్జఁదెమ్మలేక, పరిశుభ్రమైయుండ
వలయునిత్యమును నివాసమునకు. 57
            స్వతంత్ర జీవనము

తే. అన్న వస్త్రాదులకు నైన, నథికమైన
భోగభాగ్యంబులకునై సభూమిమిఁద
నొరులనేనమ్ముకొనియెప్డునుందరాదు;
తనదుచేతుల నమ్మంగఁజనునుగాని. 58

తే. పెద్దలాజి౯ంచి,లోపలఁబెట్టిచన్న
ధనము ధాన్యంబుఁజోరులు తఱియెఱింగి,
తస్కరించినఁ బోవునుదాఁచుకొన్న;
నవలవ్యధు౯నిగతియేమియగునొకనుడు. 59

తే. పూర్వులుగడించిచనుమాన్యములునుమడులు,
పండకుండును; రాజులుపన్నుచాలఁ