పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గట్టదురువానిమీఁద; దాకట్టనడున;
నపుడురిక్తునిబ్రతు కేమియగునొచెపుఁడు. 60

తే. తాతముత్తాత లెంతెంత ధనముకూడఁ
బెట్టి, పెట్టెలు నిండంగఁబెట్టియున్నఁ
గష్టపడి తామున్యాయమార్గమునఁబడయు
స్వార్జితంబొకగవ్వతోసమముగాదు. 61

తే. కాన, మానవుఁ డెప్పుడు గష్టపడుచు,
వలయువిద్యల గళలను, బాల్యముననె
చక్కఁగా నేర్చియితరులసాయమాస
పడక, తనయెంతజీవింపఁగడఁగవలయు. 62
                        ధనము

తే. న్యాయమార్గంబుతప్పక యర్థమెపుడు
మనుజుఁడార్జించు చుండంగఁజనును; దానఁ
బాత్రులకుదాన మొనరింపవలయుఁగొంత,
యనుభవింపగవలయుఁ దాననవరతము. 63

తే. తానుజేసినధర్మంబెతన్నుఁగాచు
ననుట లెస్సగాహృదయంబునందెఱింగి,
త్యాగ మొనరింపవలయుఁ; దానేగుతఱిని
తనదిచిల్లి గవ్వయువెంటఁజనదుగాన. 64

ఆ. దానమియ్యలేక, తానునుదినలేక,
ధనముభూమిలోన, దాఁచిపెట్టి,
చెడుగులుబ్దు, దానిఁ గడకుదొంగలపాలొ
నేలపాలొ, చేయునిజముగాను. 65

తే. ఆయమునకన్న నెన్నఁడునధిక మైన
వ్యయముచేయంగఁగూడదు; యాచకునకు