పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యరనిమేషమునకు నన్ని యునశియించు;
విద్యయొకటె యెపుడువిడనితొడవు. 18

తే.రాజుతనదేశముననె గౌరవముగాంచుఁ;
బండితుఁడొ,యెల్ల యెడగారవమ్మువడయుఁ;
జదువునకు రాజ్యమైనను జాలదనఁగ,
విద్యతోసాటి మఱియేదివిశ్వమునను? 19
అడఁకువ.

ఆ.ఎంతకలిమిగలుగు, నంతయడంకువఁ
గలిగియుండవలయు,గర్వపడక;
యన్ని గుణములుండి,యడఁకువ లేకున్న
నిష్ఫలంబులవియు నిశ్చయముగ. 20
 
తే.చదువునకుదోడువినయంబుగుదిరియుంట
పసిఁడికినిదావియబ్బిన భాతియగును
విద్యగలిగియు నడఁకువ వెలయకుంట
యమరతరువునుగచ్చ చెట్టలమికొనుట. 21

ఆ.అడఁగిమడఁగియుండు వాతనిగుణములు,
కొలఁదివైన,మిగుల గొప్పవగును;
విఱ్ఱవీఁగు దుండువీఱీఁడిగుణములు;
గొప్పవైన, మిగులఁగొలఁదివగును. 22

తే.క్రిందుమీఁదును గానక కెరలిపడెడు
నరునిసుగుణములెయపగుణంబులగును;
జెప్పనేటికి? వానికిఁ జెడుగుణములె
కలిగియున్న,నిఁకెట్టుగాఁదలఁపఁబుడునొ. 23
గర్వము

తే.కలిమి భువిలోన నీకెంతకలిగియున్న
గర్వపడకుము నేనెకా ఘనుఁడననుచు