పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుస్తకంబులఁ జింపక, పొదువుగాను
వాడుకొనుచుండుఁదనతోడివారుమెచ్చ. 12

తే.తనకుదీఱికయైనట్టితఱిని దినము,
సెలవులిచ్చినదినములఁ జింతనంబు
సేయుచును,నాటపాటల చెంతఁబోక
కరముస్రాఁతపారంబులగట్టిచేయు. 13

తే. చెడ్డబిడ్డలతోఁజెల్మిజేయఁబోండు;
తల్లి దండ్రులమాటల దాఁటకుండు
గురుని దైవంబుగానెంచి కొలువుసేయుఁ;
జూడమనసైన,నల్లరిజాడ;జనఁడు. 14
విద్య.

ఆ.విద్యవలన మిగుల వినయంబు గలుగును;
విద్యచేతఁ దెలివి విస్తరిలు;
విద్యచేతఁగరము వెలయునుయోగ్యత;
విద్యలేనివాఁడు వింతపశువు. 15

ఆ.ధనముతఱిఁగిపోవు దానంబుచేసిన,
విద్య దానమునను వృధ్ధినొందు;
విత్తమరసిచూడ విద్యాధనముతోడ
నీడ నంగఁ దగునె యించుకైన? 16

ఆ.చదువువేళ నీకు సందేహమేదేని
తోఁచెనేని, మదినిదాఁచుకోక,
గురునియొద్దకరిగి, గొబ్బుననడుగుము;
సిగ్గుపడియె దేని,చెడురువీవ. 17

ఆ.మురుగులుంగరములు ముత్యంపుసరులును
బురుషుని గయిసేయు భూషణములె?