పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెంచి,పెద్దవానిగఁజేసి మంచినట్టి
తల్లి ఋణమించుకయుఁ దీర్పఁదరమె మనకు? 6

తే.విద్యయును బుద్ధి చెప్పించి,వెలయఁజేసి
కాయమొక్కింతనొచ్చినఁ గలఁతపడుచుఁ
దగుచికిత్సలఁ జేయించి,తెగులుమాన్పి
మనల నింతవారిగఁ జేసె జనకుఁ డరసి. 7

తే.ఒక్కగర్భవాసంబున నుద్భవించి,
యొక్క తల్లి పొలఁబెరిగి,యొక్కశయ్యఁ
బండుకొని యుండి,పయిఁ బ్రక్కఁ బడుచు నుండు
సోదరులు పరస్పరమైత్రి నుండవలయు. 8

తే.చేయవలెఁ దల్లిదండ్రులుచెప్పు పనిని
మాఱునల్కక పుత్రుండు,మనినదనుకఁ
జుట్టముల నెల్ల బ్రేమతోఁజూడవలయఁ
జేతనై వంతసాయంబుఁజేయుచెపుడు. 9
              మంచి బాలుఁడు.

ఆ.ప్రొద్దుపొడువకుండ నిద్దుర మేల్కని
సమయకృత్యములను జక్కఁబెట్టి
పుస్తకములఁ గొనుచుఁ బొరుగుపిల్లలఁగూడి,
బడికిబోవు మంచిబాలకుండు. 10

తే.భోజనముచేయునప్పుడు బుద్ధిగలిగి
లేనివస్తువు లెమ్మని లేనిపోని
యాగడము చేసి యలఁచక,వేగమునను
గలకొలందినిభుజియించికదలిపోవు. 11

తే.తానుబడియందుజదివిన దానినెపుడు
మఱచిపోవక, వల్లించుమరలమరలఁ