పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీతి దీపిక
దేవుఁడు.

ఆ.శ్రీలొనంగ నాదుచి త్తంబులోపల
భక్తితోడనిలిసి ప్రస్తుతింతు,
నిఖలలోకవంద్యు నిత్యునిఁ బర మేశు
నాత౯జనశరణ్యు నగ్రగణ్యు. 1

ఆ.తెల్లవారలేచి దినమెల్ల గావించు
పనులలోనఁ గానిపనులు కొన్ని
కలుగుఁ గాన, వానిఁగరుణతో సైరింప
దేవుఁగొలువవలయుదినమూనందు. 2

తే.పనులఁజాలించి, నిద్రింపఁజనెడునవుడు
మనసులోనీశ్వరుని వేఁడుకొనఁగవలయు,
నొడలెఱుంగకనిదిరించుచున్న యపుడు
మనకునొకకీడురాకుండ మనుచుకొఱకు. 3

తే.మనకుమేలైనయపుడెల్ల, మఱచిపోక
దైవమును జాలభక్తి తోఁదలఁపవలయు;
నతనిదయచేతనేకదా యట్టిశుభము
లొదవుమనకని గట్టిగా మదినెఱింగి. 4

తే.కీడుమూఁడినాఁడును వేఁడుకొనుము
నీవు భగవంతుదృఢముగా భావమందు
నట్టియాపద నడఁగింవి నతఁడెతక్క
మఱియొకండుసమధు౯ం డు మహినిలేమి. 5
తనవారు.

తే.తొలుత నెన్నెన్నొవ్రతములుసలిపి,గర్భ
మందు నవమాసములుమోసి,యవలఁగాంచి