పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నెంతసిరియుండు,నంతకునేనుమడుఁగు
లడఁగియుండు;నీక యశ్రేయస్కరంబు. 24

తే. తన్నుఁదాగొప్పవానిఁగ, దలచునట్టి
కాని,చెప్పుకొనెడునట్టికాని,నరునిఁ
బరిహసింతురు,చాటునఁబ్రజలుమిగులఁ;
గనుక,నాత్మప్రశంసయెయనుచితంబు. 25

తే. మనకు లేనివిద్యయు గొప్పతనము,మనకు
గలదటంచునటించినఁ గల్ల తెలిసి
ప్రజలుమనలనవ్వుదురుచప్పటలుగొట్టి
యవిలవములేనినరుకంటెనలుసుచేసి. 26
తృప్తి.

తే. తనకుఁగలమేలుతోడనె తనిని పొంద,
మోద మొదవును;మఱిచాల లేదటంచు
మనసులో పలచింతతో వనరుచున్న,
సౌఖ్యమెడఁబాయు,నిచ్చలుశ్రమముగదురు. 27

తే. సౌఖ్యమబ్బెడునంచు,దేశమ్ములెల్లఁ
దిరుగఁబనిలేదు;మదిలోనఁదృపియొకటి
కలిగెనేనియు, నింటనె కలుగుసుఖము;
తుష్టి లేదేని ,సౌఖ్యంబు దొరకదెందు. 28

తే. ఇంతచదివితిఁజాలదె? యింకనేల?
యనుచుఁదనకున్న విద్యతో మనుజుఁడెపుడుఁ
దృప్తినొందుచునుండట, తెలివి లేమి;
బ్రతికినన్నాళ్ళు,విద్యను బడయవలయు. 29
  ధైర్యము.

తే. ఆపదలువచ్చినపు డధైర్యంబువడిన,
నంతకంతకు మఱిచింత యతిశయిల్లుఁ;