పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18 నీతిదీపిక

తే. తప్పుచేసితి వేనియు, నొప్పుకొనుము;
గురునిముంగలఁగల్పించుకొనుచువచ్చి
మాయమాటలఁజెప్పుట మానుకొమ్ము;
దాసనొజ్జలునీయెడదయఁదలంచు. 89

ఆ. పిలచియొకరు మనయభిప్రాయ మడిగినఁ
బక్షపాతబుద్ధిఁబాఱదోలి
మనసునందుఁగలదె, మాటుపెట్టక తెల్ప
వలయు, నొకనికెగ్గు గలుగుచున్న. 90

ఆ. సూక్ష్మమంచునించి చులుకసేయఁగ రాదు;
సూక్ష్మములె, వినుండు, స్థూలమగును
జలకణములు గలిసి, జలరాసికాలేదె?
చిన్నవానినేల చేయివిడువ? 91

ఆ. మహినివాఱునెలలు సహవాసమొనరింప
వారువీరలగుదు రారయంగఁ;ఒదనె
గాన, జనుఁడుమంచిమానిసిత్
చెలిమినెల్లతఱిని జేయవలయు. 92

తే. మున్నె, వాగ్దాన మొనరింపకున్నయపుడె
పదిగఁదలపోసిమఱిచేయవలయుఁజుమ్ము
చేసి చెల్లింప లేకుంటసిగ్గుపాటు
చేయఁ గలిగియుఁ జేయమి హేయమరయ. 93

తే. తిన్నగా మాటలాడంగఁ దెలియనట్టి
వాడెవండైన, నినుదప్పఁబలికెనేనిఁ
దప్పుగాఁ బట్టుకొనుచును, దాని నీవు
పట్టిపల్లార్చి, కోపంబుపడకుమెపుడు. 94

ఆ. ఒక్కకాలమందు నొక్కపనినె చేసి
యయ్యది కడముట్టనైనవెనుక