పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. ఎదుటివారిని మర్యాద నెలమిఁజేసి,
తానుమర్యాదబడయంగఁదగునునరుఁడు;
వారి నటుతాను గౌరవ పఱపకున్నఁ
దనకు గారవమబ్బఁదు; తథ్యమిదియె. 83

ఆ. మంచికార్యమునకు, మానక యెప్పుడు
యత్నమాచరించు టర్హమగును;
మొదలఁగాకయున్న, బెదరకమరిచేయ
వలయుఁ; గానినడుమవదలఁదగదు. 84

ఆ. చెడ్డకార్యమునకుఁ జేరరాదెప్పుడు;
చేరేనేనిమేటిచేటు వచ్చు;
హీనకృత్యమందు నెఱుఁగకచొచ్చినఁ
దెలిసినపుడెవిడిచి తొలఁగవలయు. 85

ఆ. అల్పబుధ్ధులెప్పు డన్యులతప్పుల
వెదకుచుందు; రల్ప విషయములనె
గొప్పగాఁగనెంచి, కోపంబువహియింతు;
రలుకవిడువకుందు రనవరతము. 86

ఆ. అలఘబుధ్ధులెపుడు నన్యులగుణముల
సభినుతింతురెఱిఁగి; యవగుణములఁ
దడవకుందు; రలుకఁదడవుగఁబూనరు;
సైరణను నహిత్రుసంతతమును. 87

ఆ. తనకుఁజేయుమేలు మనమునఁగుక్కయు
నెఱిఁగిసతముస్వామియిల్లుగాచు;
మేలుమఱచునేని, మేదినిమనుజుండు
కుక్క కన్నఁగొంతతక్కువరయ. 88