పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కాన, దొంగతనముఁ గావింపనెందైన
శిక్షతప్పకుంట సిధ్ధమరయ. 77

ఆ. ఒరులమాయచేసి సిరిఁగాంతు ననుకొంట
వెఱ్ఱితనముగాని వేఱుగాదు;
దాన, ముప్పుతనకె తప్పకఘటియిల్లుఁ
బరులఁజెఱుచువాడుబాగుపడునె? 78

పరోపకారము.


తే. కడుపె కైలాసమనియెంచి గాసిపడక
శ్రమమునకునై ననోరించి, శక్తికొలఁదిఁ
బరులకుపకారమొసరింపబాటుపడుదు
రాఁకలియుడప్పి పాటింపకలఘమతులు

వివిధ ధర్మములు.


తే. భూమిమీఁదను మనమిట్లు పుట్టుటెల్ల
భోజనంబునకేయని, మూఢమతులు
తిండియేలోక మనియుందు రొండుచింతఁ
దక్కి, ధర్మమునుదైనఁదలఁపులేక. 80

ఆ. మంచివాఁడుపుడమి మాటాడుమెల్లగాఁ
బలువయెపుడుగొంతుపగులనఱచు;
ముఱికికాల్వలెపుడు మ్రోగినలాగున
నదులునేయుచున్నె రొదలనెందు? 81

తే. భాగ్యహీనులనైన, నేవకులనైనఁ
బరుషవాక్యంబులాడుటపాడిగాదు;
దానఁ, బెట్టినపెట్టెల్లఁ గానఁజేరు;
నదనఁ జేసినమేలును బదటఁగలియు. 82