పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీతిదీపిక 15

పనిఁబనుచుట

ఆ. ఆజ్ఞ చేసినట్టులన్యులఁబనిచినఁ,
జెప్పుపనిని వారుచేయకుంద్రు;
చేసిరేని, దానిఁ జెడఁగొట్టుదురుచాల,
హృదయమందసూయపొదలుఁగనుక.72


ఆ. పరులవేఁడునట్టు పనిచేయఁ బనిచినఁ
జెప్పఁదడవదానిఁ జేయుచుంద్రు;
చేయుపనియుఁజాల శ్రేష్ఠంబుగానుండు,
మనసు కుదిరిచేయుమహిమకతన. 78

తే. చెలిమిమైఁజేఁదు మేపింపఁజెల్లుఁగాని,
బలిమిమైఁబాలుద్రావింపఁబాటుగాదు
కాన, మంచితనముననే కార్యమెపుడుఁ
దీర్పవలెఁ; గానిపనిగాదుతీవ్రపడిన. 71

చౌర్యము

ఆ. మ్రుచ్చిలంగ, రాజుమున్మున్నదండించి,
దండుగగొనుఁదొంటిధనముఁగూడ
నిరుగుపొరుగువార లెప్పుడునిందింత్రు;
పరమునందుఁజాల బాధతొడరు. 75

తే. ఎవ్వరునుజూడరనిమనమెన్నుకొన్నఁ
బాపమదియెప్పుడై ననుబయలబఁడును;
గాని, దొంగతనంబు దాఁగదునిజంబు;
దీని నెంతయులెస్సగాఁదెలియవలయు. 76

ఆ. ఎవరుఁజూడకున్న, నీశ్వరుఁడైనను
మనము సేయుకానిపనులఁగనఁడె?