మునీశ్వర పావన చరిత్రము న్శ్రుతిసంప్రదాయము చెప్పి చెప్పి తుదకు గొల్లలు మంగళ్ళు తీర్చు తగవువలె నిక్కవి తుస్సు మనిపించినాడేమి! నిండుచూలాలగు శకుంతల కనికరమెద్దియు దోచ కనాధయై రాజపురోహితుని యింటి కేడ్చుచు నరుగుట యెగిరెగిరి యెంగిలాకుమీద గాలువైచిన యాచారవంతునివలె నభ్యంగమొనర్చుట కత్తరువు బూసికొని పేడతట్ట నెత్తికెత్తుకొన్న ట్లెంతయో సింగారమున నాటకము మొదలిడి తుదకిట్లు కరుణాభీభత్సముల జూపఱ డెందములం గలంపదగదు, నాటక మిచట ముగింపబడవలసినదే కాని దు:ఖపర్యవసానముగా బూర్వ నిబంధనములంబట్టి ముగింపబడరాదను హేతువుచేతనో రాజునకు దక్కిన భార్యలవలన సంతానములేమి దానొకసారి దొంగతనమున గతికిన శకుంతల కొకవేళ దనపోల్కిం గొడుకొదవినచో వానికి దన ముదుసలితనమున రాజ్యమప్పగించం గోరియో - రాజు శకుంతలం దిరిగిచూడనెంచి తుదకొక వనములో నైదేండ్లపిమ్మట తన్నుబోలిన కొడుకు గాంచిన శకుంతలం జూచి యాపెం గొడుకుతొ నింటికి దెచ్చుకొన్నట్లు బీఱకాయపీచువలె కధ మురింపబడియె. రాజు శకుంతలం జిత్రమున వ్రాసి చూచునేమో యని భయంపడుటయు దోడనే తనకు సంతానములేదని దు:ఖపడుటయు బిచ్చికళలు కావా? శకుంతలం బెంచి యెంతయో ప్రేమించి యాపెం దుష్యంతుని కడకంపిన కాశ్యపముని దుష్యంతు డాపెన్నిరాకరించెనని శిష్యులవలన వినియు నాపెయోగక్షేమమరయ కూరకుంట లోకవిరుద్ధము. తనదేవి కంతగా జడిసిన రాజెట్లు శకుంతల నాపె కొడుకుతో నగరిలోనుంచుకొనునో ఈ నాటకమెంతయు నవల నసందర్భముగా నున్నది. నాటకరచన మందు గాళిదాసుని కంతగా శక్తిచాలదు. కాళిదాసు నాటకములకన్న నతని కావ్యములు బాగున్నవి. వానిలో రఘువంశములో మూడవంతులమేని మిగులశ్లాఘ్యం. కాళిదాసుడు జ్యోతిషమునందు వైద్యమునంది వైద్యమునందు చందోబలంకార
పుట:NavarasaTarangini.djvu/45
స్వరూపం